సీఎం రేవంత్ తన గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలి- మహేశ్వర్ రెడ్డి

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల కలలను సాకారం చేసే అద్భుతమైన బడ్జెట్. సామాన్య ప్రజానీకం కలలను సాకారం చేసే అద్భుత బడ్జెట్.

సీఎం రేవంత్ తన గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలి- మహేశ్వర్ రెడ్డి

Union Budget 2024 : కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో సీఎం రేవంత్ రెడ్డినే అడగాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలన్నారు. ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాను కలిసి ఎలాంటి అర్జీలు పెట్టుకున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ అని, దేశ యువతకు బడ్జెట్ లో పెద్ద పీట వేశారని చెప్పారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

”కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల కలలను సాకారం చేసే అద్భుతమైన బడ్జెట్. సామాన్య ప్రజానీకం కలలను సాకారం చేసే అద్భుత బడ్జెట్. గరీబ్ కల్యాణ్ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేయడమే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన. దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించే బడ్జెట్ ఇది. ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్రగామిగా నిలిపే బడ్జెట్ ఇది. గ్రామీణ భారతాన్ని, ప్రత్యేకించి వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేసే బడ్జెట్. నిరుద్యోగ సమస్యను తగ్గించడం, మహిళా సాధికారితను సాధించడం లక్ష్యాలుగా రూపొందించిన బడ్జెట్. ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన బడ్జెట్ ఇది.

ఉత్తమైనది, ఆదర్శమైనది. అన్ని రకాలుగా దేశ అభివృద్ధి కోరుకునేది. ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సినది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏమిచ్చారు? అనేది సీఎం రేవంత్ రెడ్డినే అడగాలి. ఆయన పదే పదే ఢిల్లీ వెళ్లారు. అక్కడే మకాం వేశారు. పదే పదే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిశారు. మరి ఏమైంది? బడ్జెట్ లో ఏ రకంగా కేటాయింపులు తెచ్చుకోవాలి అన్నది సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు దగ్గరి నుంచి నేర్చుకోవాలి” అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Also Read : తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరించారు, ఇంత వివక్ష ఎప్పుడూ జరగలేదు- కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్