CM Chandrababu : కేంద్ర బడ్జెట్ తరువాత తొలిసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎవరెవరితో భేటీ అవుతారంటే?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత తొలిసారి బాబు ఢిల్లీ వెళ్తుండటంపై అందరిలో ఆసక్తినెలకొంది.

CM Chandrababu : కేంద్ర బడ్జెట్ తరువాత తొలిసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎవరెవరితో భేటీ అవుతారంటే?

CM Chandrababu

CM Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత తొలిసారి బాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం సాయంత్రంతో ముగుస్తాయి. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఢిల్లీ పయనం అవుతారు. సాయంత్రం 5.10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు.. రాత్రి 7.30గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకుంటారు. రాత్రి 8గంటలకు వన్ జన్ పథ్ రోడ్డుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Also Read : CM Jagan : షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?

ఈనెల 27న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఏపీకి సంబంధించిన అంశాలపై సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చంద్రబాబు మాట్లాడనున్నట్లు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సహా, పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అవుతారనే విషయంపై అధికారిక సమాచారం లేదు. శనివారం సాయంత్రం చంద్రబాబు తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.

Also Read : ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర..! అందరికీ న్యాయం చేసేలా చంద్రబాబు సూపర్ ఫార్ములా..!