Viral Video: ఇంత నిర్లక్ష్యమా? కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని కారు డ్రైవింగ్ చేసిన తండ్రి

ఓ పక్క కారు డ్రైవింగ్ చేస్తూ మరో వైపు తన కుమార్తెతో ఆడుకుంటూ..

Viral Video: ఇంత నిర్లక్ష్యమా? కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని కారు డ్రైవింగ్ చేసిన తండ్రి

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా చాలా మంది తమ తీరును మార్చుకోవడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఓ పక్క కారు డ్రైవింగ్ చేస్తూ మరో వైపు తన కుమార్తెతో ఆడుకుంటూ కనపడ్డాడు ఆ తండ్రి. కుమార్తెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న ఈ వీడియోను అశ్విన్ రాజనేశ్ అనే వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఆ తండ్రికి తన కూతురు అంటే చాలా ఇష్టమే అయుండొచ్చని, అయితే, ఇలా డ్రైవింగ్ చేస్తూ పిల్లలకు ముప్పు తెచ్చేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు.

దీన్ని చూసి ఇతర తల్లిదండ్రులయినా ఇటువంటి చేయొద్దని నేర్చుకోవాలని చెప్పారు. అటువంటి తీరుతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంటుందని అన్నారు. కూతురితో ఆడుకుంటూ డ్రైవింగ్ చేసిన తండ్రిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటలు ఆడుకోవడం, ఒడిలో కూర్చుబెట్టుకోవడం వంటివి ఇంట్లో చేసుకోవాలని, కారులో కాదని బుద్ధి చెబుతున్నారు.

Also Read: వాన నీటికి రూ.80 లక్షల కారు డ్యామేజ్.. మండిపడ్డ కారు యజమాని