Gautam Gambhir : ఏమయ్యా గంభీర్.. పాండ్యా కెరీర్‌తో ఆడుతున్నావా ఏంటి..? స్పిన్నర్‌గా మారిన హార్దిక్..!
గంభీర్ మార్గదర్శకత్వంలో భారత ప్లేయర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
![Gautam Gambhir : ఏమయ్యా గంభీర్.. పాండ్యా కెరీర్‌తో ఆడుతున్నావా ఏంటి..? స్పిన్నర్‌గా మారిన హార్దిక్..! Gautam Gambhir : ఏమయ్యా గంభీర్.. పాండ్యా కెరీర్‌తో ఆడుతున్నావా ఏంటి..? స్పిన్నర్‌గా మారిన హార్దిక్..!](https://10tv.in/wp-content/uploads/2024/07/Gambhir-To-Turn-Hardik-Pandya-Into-Spinner.jpg)
Gambhir To Turn Hardik Pandya Into Spinner
Gautam Gambhir – Hardik Pandya : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం (జూలై 27) భారత్, శ్రీలంక జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. పల్లెకల్లె వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. టీమ్ ఇండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే తొలి సిరీస్ కావడంతో లంక పర్యటనను వీరిద్దరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మొదటి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను గెలుపుతో బోణీ కొట్టాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత ప్లేయర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. ఇందులో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లెగ్ స్పిన్ బౌలర్‌గా మారడం అందరిని ఆశ్చర్యపరిచింది.
వాస్తవానికి పాండ్యా మీడియం పేసర్ అన్న సంగతి తెలిసిందే. లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడంతో దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్‌కు సహకరిస్తాయని అందుకనే పాండ్యాను స్పిన్నర్‌గా గంభీర్ మార్చేందుకు ప్రయత్నిస్తుందని కొందరు అనగా, మరికొందరు మాత్రం పాండ్యా సరదాగా మాత్రమే ఇలా బౌలింగ్ వేశాడని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికి కూడా పాండ్యా లెగ్ స్పిన్ బౌలింగ్ వేసే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే.. లంక పర్యటనలో హార్దిక్ పాండ్యా కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. అతడు వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే.
IND vs SL : శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్..
Hardik Pandya the leg spinner in the practice session. 😄👌 pic.twitter.com/mld6IBpKYt
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 26, 2024