Ram NRI : ‘రామ్ NRI’ మూవీ రివ్యూ.. బంధాలు, బంధుత్వాల కోసం..

జీవితంలో ఎంత బిజీ అయినా, ఎంత దూరం ఎగిరినా మన బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలి అనే కథాంశంతో ఈ రామ్ NRI తెరకెక్కించారు.

Ram NRI : ‘రామ్ NRI’ మూవీ రివ్యూ.. బంధాలు, బంధుత్వాల కోసం..

Bigg Boss Fame Ali Raza Ram NRI Movie Review and Rating

Ram NRI Movie Review : బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటుడు అలీ రజా హీరోగా సీతా నారాయణన్‌ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘రామ్‌ NRI’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌’ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మువ్వా క్రియేషన్స్‌ బ్యానర్ పై MSK ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ నిర్మాణంలో ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. రామ్ NRI సినిమా నేడు జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. అమెరికాలో ఉండే శ్రీనివాస్, సనలకు ఒక్కడే కొడుకు రామ్. సన అమెరికాలో ఇండియన్ కల్చర్ గురించి విశ్వభారతి అనే ఓ అసోసియేషన్ నడిపిస్తూ ఉంటుంది. రామ్ కి పేరెంట్స్ ఎక్కువ టైం ఇవ్వకపోవడంతో లోన్లీగా ఫీల్ అయి ఇండియాలో ఉన్న తాతయ్య(విజయ్ చందర్) నానమ్మ(గీతాంజలి) వద్దకు వస్తాడు. అక్కడ ఊళ్ళో బ్యాంకులో పనిచేసే శ్రావణి (సీత నారాయణన్)తో ప్రేమలో పడతాడు రామ్. రామ్ కు తన తండ్రి, తాతల గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. తన మామయ్య తనని ద్వేషిస్తాడు.

అసలు రామ్ ని ఎందుకు తన మామయ్య ద్వేషిస్తున్నాడు? రామ వాళ్ళ నాన్న ఏం చేసాడు? రామ్ ప్రేమ కథ ఏమైంది? రామ్ గ్రాండ్ పేరెంట్స్ ఎందుకు బాధపడుతున్నారు? రామ్ పేరెంట్స్ ఇండియాకు వచ్చారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. జీవితంలో ఎంత బిజీ అయినా, ఎంత దూరం ఎగిరినా మన బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలి అనే కథాంశంతో ఈ రామ్ NRI తెరకెక్కించారు. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చినా కథ పరంగా రెగ్యులర్ కథే. అమెరికాలో ఉండే కుర్రాడు ప్రేమ, ఆప్యాయతల కోసం ఇండియాకు వస్తే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అని కమర్షియల్ అంశాలతో చూపించారు. హీరో – హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ ట్రాక్ వర్కౌట్ అవుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలా తెరకెక్కించినా ఐటం సాంగ్ కమర్షియాలిటీ కోసం పెట్టినట్టు ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో సినిమా సాగదీతలా ఉంటుంది.

Also Read : Purushothamudu : ‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ సినిమా ఎలా ఉంది?

నటీనటుల పర్ఫార్మెన్స్.. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అలీ రజా ఓ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే మెయిన్ లీడ్ లో ఈ సినిమా చేసాడు. అమెరికా నుంచి వచ్చిన NRI పాత్రలో మెప్పించాడు అలీ రజా. సీత నారాయణన్ అందంతో పాటు నటనతో కూడా పర్వాలేదనిపించింది. విజయ్ చందర్, గీతాంజలి.. గ్రాండ్ పేరెంట్స్ పాత్రలో మెప్పించి ఎమోషన్ పండించారు. సూర్య, జయవాణి, మువ్వా సత్యనారాయణ, సన.. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తాయి. కథ, కథనం పాతవే అయినా వాటిని కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. ఫస్ట్ సినిమా అయినా సినిమాతో ఒక మంచి మెసేజ్ ఇవ్వడంలో దర్శకుడు లక్ష్మీ నందా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాణ పరంగా చిన్న సినిమా కాబట్టి తక్కువ బడ్జెట్ లో సినిమాని తీసుకురావడానికి ప్రయత్నించారు.

మొత్తంగా రామ్ NRI సినిమా అమెరికాలో ఉండే అబ్బాయి ఇండియాలో తన ఊరికి వచ్చి బంధాలు, బంధుత్వాలతో కలిసిమెలిసి ఉన్నాడా అని కమర్షియల్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.