ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటి నుంచి, ఎవరెవరికి, ఏ బస్సులో ప్రయాణం ఉచితం? నివేదిక సిద్ధం చేసిన అధికారులు

ఫ్రీ బస్ జర్నీతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా.

ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటి నుంచి, ఎవరెవరికి, ఏ బస్సులో ప్రయాణం ఉచితం? నివేదిక సిద్ధం చేసిన అధికారులు

Free Bus Travel Scheme : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని అమలు పరిచే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్రీ బస్ జర్నీపై సీఎం చంద్రబాబు రేపు సమీక్ష నిర్వహించనున్నారు. పథకం అమలు, విధివిధానాలపై ఆర్టీసీ, రవాణశాఖ అధికారులతో చర్చించనున్నారు.

అయితే, ఫ్రీ జర్నీ పథకంపై అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు. ఫ్రీ బస్సు స్కీమ్ ని అమలు చేసిన కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన ఏపీ ఆర్టీసీ అధికారుల బృందం ఇప్పటికే ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఫ్రీ బస్ జర్నీతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా.

* ఉచిత బస్సు పథకం అమలుపై రేపు సీఎం చంద్రబాబు సమీక్ష
* పథకం విధివిధానాలు, అమలుపై చర్చించనున్న చంద్రబాబు
* ఉచిత బస్సు స్కీమ్ పై నివేదిక సిద్ధం చేసిన అధికారులు
* ఫ్రీ జర్నీతో నెలకు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా
* రోజు 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్న నివేదిక
* తెలంగాణ, కర్నాటకల్లో అధ్యయనం చేసిన ఆర్టీసీ అధికారులు
* పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నంలలో సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత జర్నీ
* ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో ఓఆర్ శాతం 69 నుంచి 70
* ఉచిత ప్రయాణం అమలైతే 95 శాతానికి చేరనున్న ఓఆర్

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు పథకం తీరును ఏపీ ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు. ఉచిత బస్సు స్కీమ్ ను ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎదురైన ఇబ్బందులు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు అధికారులు. దీనిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. అతి త్వరలోనే ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని మంత్రులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలో దీనిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఉచిత బస్సు స్కీమ్ అమలు చేయడం ద్వారా ఆర్టీసీపై నెలకు రూ.250 కోట్లు భారం పడనుందని అంచనా వేశారు. ఏయే బస్సుల్లో అనుమతిస్తారు, ఎంత మేర ఆర్థిక భారం పడనుంది, ఇప్పుడున్న సర్వీసులు సరిపోతాయా, అదనంగా సర్వీసులు ఏర్పాటు చేయాలా, ఎంతవరకు లిమిట్ చేయాలి అనే విధివిధానాలపై సీఎం చంద్రబాబు రివ్యూ చేసిన అనంతరం.. ఈ పథకాన్ని అమలు చేయనుంది ఎన్డీయే సర్కార్.

Also Read : జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ షర్మిల.. తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్