MS Dhoni : ఈ కండిష‌న్‌కు బీసీసీఐ ఓకే అంటేనే.. ఐపీఎల్ 2025లో ధోని ఆడేది..?

మ‌హేంద్రుడు ఐపీఎల్ 2025 ఆడ‌తాడో లేదో అన్న సంగ‌తి స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు.

MS Dhoni : ఈ కండిష‌న్‌కు బీసీసీఐ ఓకే అంటేనే.. ఐపీఎల్ 2025లో ధోని ఆడేది..?

MS Dhoni

MS Dhoni – IPL 2025 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను రుతురాజ్ గైక్వాడ్ కు అప్ప‌గించారు మ‌హేంద్ర సింగ్ ధోని. ఈ సీజ‌న్‌లో షినిష‌ర్‌గా వ‌చ్చిన ధోని త‌నదైన శైలిలో అల‌రించాడు. అయితే.. మ‌హేంద్రుడు ఐపీఎల్ 2025 ఆడ‌తాడో లేదో అన్న సంగ‌తి స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. బీసీసీఐ తీసుకునే రిటెన్షన్ నిర్ణయంపై ధోని ఐపీఎల్ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు మెగా వేలం జ‌ర‌గ‌నుంది.

దీంతో దాదాపుగా అందరు ఆట‌గాళ్లు వేలంలోకి రానున్నారు. ఇక ప్రాంఛైజీలు ఎంత మంది ఆట‌గాళ్ల‌ను రీటైన్ చేసుకోవాల‌నుకునే దానిపై ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త లేదు. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం..ప్రతి ఫ్రాంచైజీ 5 నుండి 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవడానికి బీసీసీఐ అనుమ‌తి ఇస్తేనే ధోని ఐపీఎల్ 2025లో ఆట‌గాడిగా కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

Hardik Pandya : కొడుకు బ‌ర్త్‌ డే.. నా క్రైమ్ పార్ట్‌నంటూ హార్దిక్ ఎమోష‌న‌ల్ పోస్ట్..

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా , మతీషా పతిరానా, ఆల్‌రౌండ‌ర్‌ శివమ్ దూబేల‌ను రిటైర్ చేసుకోవాల‌ని చెన్నై భావిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ రిటైన్ అంశం ముంబైలోని బీసీసీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో బుధ‌వారం (జూలై 31)న ఫ్రాంఛైజీల య‌జ‌మానుల‌తో బీసీసీఐ అధికారులు స‌మావేశం కానున్నారు.

ఇక బీసీసీఐ సైతం ఒక్కొ ఫ్రాంఛైజీ 5 నుంచి 6 గురు ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వొచ్చున‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే మాత్రం ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో త‌లా మ‌రోసారి మైదానంలో చూడొచ్చు.

Team India : ‘సూర్య‌కుమార్ యాద‌వ్ తాత్కాలిక కెప్టెనే.. స‌రైన నాయ‌కుడు అత‌డే..’