Fish Farming : మంచినీటి చెరువుల్లో పెంచాల్సిన చేప రకాలు.. కొద్దిపాటి జాగ్రత్తలతో అధిక దిగుబడి!

Fish Farming : మంచినీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు చేపల పెంపకం చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి చెరువుల్లో పిలలను వదలడానికి ఇదే సరైన సమయం.

Fish Farming : మంచినీటి చెరువుల్లో పెంచాల్సిన చేప రకాలు.. కొద్దిపాటి జాగ్రత్తలతో అధిక దిగుబడి!

Types Of Fresh Water Fish Farming

Fish Farming : మారుతున్న వాతావరణ పరిస్థితులు,  మార్కెట్ ఆటుపోట్లు , పెరుగుతున్న పెట్టుబడులతో వ్యవసాయం గిట్టుబాటు కాబడం లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అనుబంధరంగాలను చేపట్టడం రైతుకు మేలు చేస్తుంది. ఇందులో పాడిపశువులు, జీవాలు, కోళ్లు, పట్టుపురుగుల పెంపకంతో పాటు చేపల పెంకం ఉన్నాయి.

మంచినీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు చేపల పెంపకం చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి చెరువుల్లో పిలలను వదలడానికి ఇదే సరైన సమయం. మంచినీటి చెరువుల్లో వదలడానికి అనువైన చేప రకాల గురించి తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బాలకృష్ణ.

మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గంతలో కంటే అధికంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మంచినీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే, చేపల పెంపకంలో ఆదాయం తక్కువగా వున్నా, స్థిరమైన రాబడి వుండటం, నష్ట భయం తక్కువ వుండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రధానంగా కట్ల, రాగండి చేపలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు.  వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను పెంచుతున్నారు . అయితే ఈసాగు అన్ని కాలాల సాగుతుండటంతో రైతులు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటి నుండి బయట పడేందుకు ఎంలాంటి రకాలను ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త బాలకృష్ణ.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు