Devara Song : ఎన్టీఆర్ ‘దేవర’ సెకండ్ సాంగ్ లిరిక్స్ లీక్ చేసేసిన లిరిసిస్ట్.. రొమాంటిక్ మెలోడీ రానుంది..
గత కొన్ని రోజులుగా దేవర సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
![Devara Song : ఎన్టీఆర్ ‘దేవర’ సెకండ్ సాంగ్ లిరిక్స్ లీక్ చేసేసిన లిరిసిస్ట్.. రొమాంటిక్ మెలోడీ రానుంది.. Devara Song : ఎన్టీఆర్ ‘దేవర’ సెకండ్ సాంగ్ లిరిక్స్ లీక్ చేసేసిన లిరిసిస్ట్.. రొమాంటిక్ మెలోడీ రానుంది..](https://10tv.in/wp-content/uploads/2024/07/devara-second-song.jpg)
Devara Second Song Lyrics Leaked by Lyricist song on NTR Janhvi Kapoor
Devara Song : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ఫుల్ మాస్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమాని గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక మాస్ సాంగ్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత కొన్ని రోజులుగా దేవర సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ – జాన్వీ పై ఇటీవల థాయిలాండ్ వెళ్లి మరీ ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని చిత్రీకరించారు. ఆ పాటే ఇప్పుడు రిలీజ్ కాబోతుందని సమాచారం. తాజాగా దేవరలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ లో.. ‘తంగం అంతరంగం.. హాయిగా.. ఉయ్యాలూగుతున్నట్టుంది..’ అనే లిరిక్స్ రాసి ఇప్పుడే విన్నాను. త్వరలోనే వచ్చేస్తుందిలే అని పోస్ట్ చేసారు.
Also Read : Pawan Kalyan – Purnaa : పవన్ కళ్యాణ్‌తో ఒక్క ఫోటో ఇప్పించు ప్లీజ్.. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..
ఆ లిరిక్స్ చూస్తుంటే రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఎన్టీఆర్, జాన్వీలపై ఉండే సాంగ్ అని అర్ధమవుతుంది. ఈ సినిమాలో జాన్వీ క్యారెక్టర్ పేరు తంగం అని గతంలో జాన్వీ పోస్టర్ రిలీజ్ చేసినపుడు చెప్పారు. తంగం అంటే బంగారం అని అర్థమట. ఇప్పుడు తంగం అంటూనే సాంగ్ రాసుకున్నారు. ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తునారు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
తంగం అంతరంగం…..
హాయిగా…..
ఉయ్యాలూగుతున్నట్టుంది….
ఇప్పుడే విన్నా…
త్వరలోనే వచ్చేస్తుందిలే…
శుభోదయం❤️
Worth d wait Varmaa😎
— RamajogaiahSastry (@ramjowrites) July 29, 2024