VD 12 : విజ‌య్‌దేవ‌ర‌కొండ‌-గౌత‌మ్ తిన్ననూరి మూవీ నుంచి సాలీడ్ అప్‌డేట్‌..

గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు.

VD 12 : విజ‌య్‌దేవ‌ర‌కొండ‌-గౌత‌మ్ తిన్ననూరి మూవీ నుంచి సాలీడ్ అప్‌డేట్‌..

Vijay DeveraKonda new movie VD12 release date fix

VD 12 release date : గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. VD12 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌ల శ్రీలంక షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. దాదాపుగా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా చిత్ర బృందం సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. వ‌ర్షంలో త‌డుస్తూ, ముఖంపై ర‌క్తంతో ఉన్న విజ‌య్‌.. దెబ్బ‌లు త‌గ‌ల‌డంతో ర‌క్తం వ‌స్తుండ‌గా చాలా కోపంగా పైకి చూస్తూ అరుస్తున్నాడు. మొత్తంగా ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.

Darling : న‌భాన‌టేష్‌ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.