IND vs SL 1st ODI : ముగిసిన శ్రీలంక ఇన్నింగ్స్‌.. భార‌త ల‌క్ష్యం ఎంతంటే..?

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కొలంబో వేదిక‌గా భారత్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది.

IND vs SL 1st ODI : ముగిసిన శ్రీలంక ఇన్నింగ్స్‌.. భార‌త ల‌క్ష్యం ఎంతంటే..?

IND vs SL 1st ODI

టీమ్ఇండియా టార్గెట్ 231

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగులు చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో పాతుమ్ నిస్సాంక (56), దునిత్ వెల్లలాగే (66*) లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్, అర్ష్‌దీప్ సింగ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్‌,  శివ‌మ్ దూబె, కుల్దీప్ యాద‌వ్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు

హ‌స‌రంగ ఔట్‌..
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అక్ష‌ర్ ప‌టేల్ క్యాచ్ అందుకోవ‌డంతో వ‌నిందు హ‌స‌రంగ (24) ఔట్ అయ్యాడు. దీంతో 42.6వ ఓవ‌ర్‌లో 178 ప‌రుగుల వ‌ద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది.

జనిత్ లియానాగే ఔట్‌.. 
శ్రీలంక మ‌రో వికెట్ కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో జనిత్ లియానాగే (20) ఔట్ అయ్యాడు. దీంతో 34.2 ఓవ‌ర్ల‌లో 142 ప‌రుగుల వ‌ద్ద శ్రీలంక ఆరు వికెట్ల‌ను కోల్పోయింది.

పాతుమ్ నిస్సాంక ఔట్.. 
వాషింగ్ట‌న్ సుంద‌ర్ బౌలింగ్లో పాతుమ్ నిస్సాంక(56; 75 బంతుల్లో 9 ఫోర్లు) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 26.3 ఓవ‌ర్ల‌లో 101 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచ‌రీ..
వాషింగ్ట‌న్ సుంద‌ర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 67 బంతుల్లో పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

అస‌లంక ఔట్‌.. 
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో చ‌రిత్ అసలంక (14) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 23.5వ ఓవ‌ర్‌లో 91 ప‌రుగుల వ‌ద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది.

సదీర సమరవిక్రమ ఔట్‌.. 
శ్రీలంక మ‌రో వికెట్ కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ క్యాచ్ అందుకోవ‌డంతో సదీర సమరవిక్రమ (8) ఔట్ అయ్యాడు. దీంతో 18.3వ ఓవ‌ర్‌లో 60 ప‌రుగుల వ‌ద్ద లంక జ‌ట్టు మూడో వికెట్ కోల్పోయింది.

కుసాల్ మెండీస్ ఔట్‌.. 
శ్రీలంక మ‌రో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబె బౌలింగ్‌లో కుశాస్ మెండీస్ (14) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 13.1వ ఓవ‌ర్‌లో 46 ప‌రుగుల వ‌ద్ద లంక జ‌ట్టు రెండో వికెట్ కోల్పోయింది.

అవిష్క ఫెర్నాండో ఔట్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జ‌ట్టుకు ఆదిలోనే షాక్ త‌గిలింది. సిరాజ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ అందుకోవ‌డంతో అవిష్క ఫెర్నాండో (1) ఔట్ అయ్యాడు. దీంతో 2.3వ ఓవ‌ర్‌లో 7 ప‌రుగుల వ‌ద్ద లంక మొద‌టి వికెట్ కోల్పోయింది.

భార‌త తుది జ‌ట్టు..
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్, కోహ్లి, శ్రేయస్, కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్ట‌న్ సుందర్‌, శివమ్‌ దూబె, అక్షర్ ప‌టేల్‌, కుల్‌దీప్ యాద‌వ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహమ్మద్‌ సిరాజ్‌.


శ్రీలంక తుది జ‌ట్టు..
పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీప‌ర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్‌), జనిత్ లియానాగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, అకిల దనంజయ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్

టాస్‌..

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కొలంబో వేదిక‌గా భారత్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బౌలింగ్ చేయ‌నుంది. గాయం కార‌ణంగా ఆట‌కు దూర‌మైన పంత్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. తొలి వ‌న్డేలో అత‌డికి స్థానం ద‌క్క‌లేదు. కేఎల్ రాహుల్‌ను వికెట్ కీప‌ర్‌గా తీసుకున్నారు.