Juuri Grass Quality : అధిక పోషక విలువలు కలిగిన నూతన పశుగ్రాసం జూరీ..

Juuri Grass Quality : అధిక దిగుబడినిచ్చే గడ్డి  గ్రాసాలు అనేకం వున్నా సరిపడా దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు . ఈ నేపధ్యంలో ఏటా టన్నులకొద్దీ దిగుబడినిస్తూ, అధిక మాంసకృతులు కలిగిన నూతన పశుగ్రాసం గురించి తెలియజేస్తున్నారు

Juuri Grass Quality : అధిక పోషక విలువలు కలిగిన నూతన పశుగ్రాసం జూరీ..

Juuri Grass is Quality Fodder for Cattle

Juuri Grass Quality : వ్యవసాయ అనుబంధ రంగాలు ఎంతోమంది రైతులకు, నిరుద్యోగ యువతకు  ఉపాధి మార్గంగా నిలుస్తున్నాయి. వీటిలో పాడిపరిశ్రమ, జీవాల పోషణ, కుందేళ్ళ పెంపకం నేడు వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. అయితే వీటి పెంపకాన్ని ప్రారంభించాలనుకునేవారు ముందుగా వాటికందించే పశుగ్రాసాల మీద దృష్ఠి పెట్టాలి.

Read Also : Cattle Breeding Techniques : లేగదూడల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అధిక దిగుబడినిచ్చే గడ్డి  గ్రాసాలు అనేకం వున్నా సరిపడా దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు . ఈ నేపధ్యంలో ఏటా టన్నులకొద్దీ దిగుబడినిస్తూ, అధిక మాంసకృతులు కలిగిన నూతన పశుగ్రాసం గురించి తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్  డీన్  వెంకట శేషయ్య .

పచ్చిక బయళ్లు సరిపడా లేక పాడిపశువులు, జీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండటంతో పాటు పోషకాల లోపంతో పశు ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా, గన్నవరంలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ వారు తక్కువ సమయంలో, తక్కువ స్థలంలో అధిక పోషకాలుండే గడ్డి జాతి జూరీ రకాన్ని పెంపకం చేపట్టి రైతులకు విత్తనం, పిలకలు అందిస్తున్నారు.

ఈ జూరీ గడ్డి. నాటిన తర్వాత పదేళ్ల పాటు తిరిగి చూడాల్సిన పని ఉండదు. సౌతాఫ్రికాకు చెందిన ఈ రకం లో అధిక పోషకాలు ఉండి ఎక్కువ పాల ఉత్పత్తికి, దూడల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ గడ్డి బెట్టను తట్టుకోవడమే కాకుండా నీడలో సైతం పెరుగుతుంది . ఉద్యాన తోటల్లో అంతర పంటగా కూడా వేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్  డీన్  వెంకట శేషయ్య .

ఆకులు ఎక్కువ, కాండం తక్కువగా ఉంటుంది. ఈ పశుగ్రాసంలో మాంసకృత్తులు ఎక్కువ. ఫలితంగా పాల దిగుబడి పెరుగుతుంది. ఆవులు, గేదెలతో పాటు గొర్రె, మేకలు కూడా జూరీ గడ్డిని ఇష్టంగా తింటాయి. ఈ గడ్డిని నారు, పిలకల పద్ధతిలో సాగు చేయవచ్చు. నాటిన మొక్కలు 80 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. ఆ తరువాత ప్రతి 35 నుండి 40 రోజులకు ఒక సారి కోతకు వస్తుంది. ఇలా ఏడాదిరికి 6 కోతల వరకు గడ్డిని పొందవచ్చు. ఇలా 10 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. ఇప్పటికే జూరీ గడ్డి విత్తనాల ఉత్పత్తి జరుగుతోంది. కావాల్సిన రైతులకు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో సంప్రదించవచ్చు.

Read Also : Breeding Management : ఫ్యాషన్‌తో మేలుజాతి పశువుల పెంపకం..