Devara : దేవ‌ర సాంగ్ పై ట్రోల్స్‌.. సోప్ యాడ్‌లా ఉందంటూ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవ‌ర‌.

Devara : దేవ‌ర సాంగ్ పై ట్రోల్స్‌.. సోప్ యాడ్‌లా ఉందంటూ..!

Trolls on JR NTR Devara Second song

JR NTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవ‌ర‌. ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. తొలి భాగం సెప్టెంబ‌ర్ 27 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ మూవీ నుంచి సోమ‌వారం రెండో పాట‌ను విడుద‌ల చేసింది. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండ‌దు కాసేపు.. అస్త‌మానం నీ లోక‌మే నా మైమ‌ర‌పు.. చేత‌నైతే నువ్వే న‌న్ను ఆపు’ అంటూ రొమాంటిక్ మెలోడిగా ఈ పాట సాగుతోంది.

ఇక బీచ్ బ్యాక్ గ్రౌండ్‌లో ఎన్టీఆర్‌-జాన్వీక‌పూర్ పై చిత్రీక‌రించిన ఈ పాట అదిరిపోయింది. వీరిద్ద‌రి కెమిస్ట్రీ నెక్ట్ లెవెల్‌లో ఉంది. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ పాట పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ సాంగ్ ట్యూన్ కాపీ అని అంటున్నారు. ఈ పాట ట్యూన్ ఫేమ‌స్ శ్రీలంక సాంగ్‌లా ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు.

Modern Masters : రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీని తెరకెక్కించింది ఎవరో తెలుసా?

ఇంకొంద‌రు అయితే.. ఏకంగా విజువ‌ల్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు. స‌బ్బు యాడ్‌ల ఉందంటున్నారు. సింథాల్‌, రెక్స్‌జోనా, లిరిల్ స‌బ్బు యాడ్స్‌ల‌ను వీడియో మిక్స్ చేసి వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ పై ఎన్టీఆర్ అభిమానులు మండిప‌డుతున్నారు. ఇలా చేస్తున్న వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్మాణ సంస్థ‌ను కోరుతున్నారు. వాస్త‌వానికి ఈ పాట విజువ‌ల్స్ అద్భుతంగా ఉన్నాయ‌ని చెప్పొచ్చు.

ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా టాలీవుడ్ న‌టుడు శ్రీకాంత్ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

Allu Sneha – Arha : తిరుమలకు కాలి నడకన అల్లు అర్జున్ భార్య, కూతురు.. అర్హ పాప ఎంత క్యూట్ గా ఉందో..