షేక్‌ హసీనా పతనం.. నేను ముందే చెప్పాను.. అక్షరాలా జరిగింది: ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని

హసినాకు ఈ గతి పడుతుందని తాను ముందే ఊహించానంటున్నారు భారత్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని. గతేడాది డిసెంబర్ లోనే దీని గురించి హసినాను అలర్ట్ చేసినట్టు చెప్పారాయన.

షేక్‌ హసీనా పతనం.. నేను ముందే చెప్పాను.. అక్షరాలా జరిగింది: ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని

Astrologer Prashanth Kini Prediction About Sheikh Hasina Downfall Comes True

Astrologer Prashanth Kin: బంగ్లాదేశ్‌ను 15 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా చివరకు దేశం విడిచి దొంగచాటుగా పారిపోవాల్సి వచ్చింది. స్టూడెంట్స్ పోరాటానికి తలవంచి పదవితో పాటు సొంత దేశాన్ని వీడాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు కల్సించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం అత్యంత తీవ్రరూపం దాల్చడం షేక్‌ హసీనా పతనానికి దారితీసింది. ఆందోళనకారులు తన అధికారిక నివాసంలోకి చొచ్చుకురావడంతో షేక్‌ హసీనా.. స్వదేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు వచ్చారు.

అయితే హసినాకు ఈ గతి పడుతుందని తాను ముందే ఊహించానంటున్నారు భారత్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని. గతేడాది డిసెంబర్ లోనే దీని గురించి హసినాను అలర్ట్ చేసినట్టు చెప్పారాయన. షేక్‌ హసీనా పదవి కోల్పోయి ఇండియాలో ఆశ్రయం పొందిన నేపథ్యంలో ప్రశాంత్ కిని స్పందించారు. ఆగస్టు సంక్షోభం ఎదుర్కొబోతున్నారని తాను చెప్పిన విషయం అక్షరాల నిజమైందని పేర్కొన్నారు.

”షేక్‌ హసీనా 2024, ఆగస్టులో కష్టాల్లో పడతారని నేను ముందే ఊహించాను. ఇప్పుడామె స్వదేశం నుంచి పారిపోతారా” అంటూ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. షేక్ హసీనా మే జూన్ జులై ఆగస్టు 2024లో జాగ్రత్తగా ఉండాలి. ఆమెపై హత్యాప్రయత్నాలు జరగొచ్చని గతేడాది డిసెంబర్ 14న ఆయన ట్వీట్ చేశారు.

 

”షేక్ హసీనాను గద్దె దించాలని అమెరికా, మిత్రదేశాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ప్రయత్నాలు జరగబోతున్నాయి. రాబోయే నెలల్లో ముఖ్యంగా మే జూన్, జూలై 2024లో ఆమె జాగ్రత్తగా ఉండాలంటూ” అక్టోబర్ 31న చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో ప్రశాంత్ కిని గతంలో చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: మరికొన్ని రోజులు భారత్ లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. షాకిచ్చిన యూకే!