Rajamouli : రాజమౌళి షార్ట్ ఫిలింతోనే కెరీర్ మొదలు పెట్టాడని తెలుసా? ఏ షార్ట్ ఫిలిం అంటే..

తన కెరీర్ ఎలా మొదలైందో తెలిపారు రాజమౌళి.

Rajamouli : రాజమౌళి షార్ట్ ఫిలింతోనే కెరీర్ మొదలు పెట్టాడని తెలుసా? ఏ షార్ట్ ఫిలిం అంటే..

Rajamouli says his Creer starts with Short Film Interesting Details Here

Rajamouli : ఇప్పుడు చాలా మంది సినీ పరిశ్రమలోకి వచ్చేవాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తీసి తమ ట్యాలెంట్ చూపించి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతున్నారు. చాలా మంది డైరెక్టర్స్ కూడా గతంలో షార్ట్ ఫిలిమ్స్ చేసినవాళ్ళే. మన తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి కూడా గతంలో షార్ట్ ఫిలిమ్స్ చేసాడని చాలా తక్కువ మందికి తెలుసు.

ఇటీవల నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీసింది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి అనేక విషయాలు తెలిపారు. ఈ క్రమంలో తన కెరీర్ ఎలా మొదలైందో కూడా తెలిపారు రాజమౌళి.

Also Read : Samantha : వాట్.. ఆ సిరీస్‌కి సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుందా? ఫస్ట్ సౌత్ హీరోయిన్‌గా రికార్డ్..?

రాజమౌళి తన కెరీర్ ప్రారంభం గురించి చెప్తూ.. ఎన్టీఆర్ ప్రభుత్వంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా అడ్వైజర్ గా ఉన్నప్పుడు లిటరసీ, చదువు గొప్పదనం గురించి ప్రభుత్వానికి షార్ట్ ఫిలిమ్స్ తీయాల్సి వస్తే ఆయనతో ఉన్న పరిచయంతో కొన్ని కాన్సెప్ట్స్ రాసి తీసుకెళ్ళాను. అవి నచ్చడంతో డైరెక్షన్ ఎవరు చేస్తారని ఆలోచిస్తుండగా నేనే చేస్తానని చెప్పడంతో రాఘవేంద్రరావు ఓకే చెప్పారు. అలా ప్రభుత్వం కోసం మొదటిసారి డైరెక్టర్ గా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఆ వర్క్ నచ్చి రాఘవేంద్రరావు శాంతినివాసం సీరియల్ కి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఛాన్స్ కూడా రాఘవేంద్ర రావు గారే ఇచ్చారు అని తెలిపారు.