Vinesh Phogat : అంతా అయిపోలేదు.. వినేశ్ ఫోగట్‌కు ప‌త‌కం పై ఆశ‌లు మిగిలే ఉన్నాయ్‌..!

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ ఫైన‌ల్‌కు ముందు అనూహ్య‌రీతిలో వైదొల‌గాల్సి వ‌చ్చింది.

Vinesh Phogat : అంతా అయిపోలేదు.. వినేశ్ ఫోగట్‌కు ప‌త‌కం పై ఆశ‌లు మిగిలే ఉన్నాయ్‌..!

Vinesh Phogat

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ ఫైన‌ల్‌కు ముందు అనూహ్య‌రీతిలో వైదొల‌గాల్సి వ‌చ్చింది. మహిళల 50 కేజీల విభాగంలో ఆమె ఫైన‌ల్‌కు చేరుకుంది. అయితే.. ఫైన‌ల్ బౌట్‌కు కొన్ని గంట‌ల ముందు ఆమె నిర్ణీత బ‌రువు కంటే 100 గ్రాములు ఎక్కువ‌గా ఉంద‌నే కార‌ణంతో అన‌ర్హ‌త వేటు వేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అన‌ర్హ‌త వేటు ప‌డ‌డంతో ఆమెకు ఈ విభాగంలో చివ‌రి స్థానాన్ని కేటాయించారు. దీంతో ఆమెకు ఎలాంటి ప‌త‌కం రాకుండా పోయింది.

కాగా.. దీనిపై వినేశ్ ఫోగ‌ట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్‌)ను ఆశ్ర‌యించింది. ఫైన‌ల్‌కు ముందు అన‌ర్హ‌తకు గురి కావ‌డంతో త‌న‌కు వెండి ప‌త‌కం ఇవ్వాల‌ని కోరింది. రజత పతకాన్ని కోరుతూ వినేష్ ఫోగట్ చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఆన్‌లైన్‌లో దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

వినేశ్ పొగట్ ఓవర్ వెయిట్ వివాదం.. రోహిత్ శర్మపై నెటిజన్ల కామెంట్లు

వినేశ్ ఫోగట్ తరపున వాదనలు జోయెల్ మోన్లూయిస్, ఎస్టేల్ ఇవనోవా, హబ్బైన్ ఎస్టేల్ కిమ్ చార్లెస్ అమ్సన్ లు వాద‌న‌లు వినిపించ‌నున్నారు. ఇందులో గ‌నుక వినేశ్ ఫోగ‌ట్ కు అనుకూలంగా తీర్పు వ‌స్తే.. ఆమెకు వెండిప‌త‌కం ద‌క్క‌నుంది.

కాగా.. సీఏఎస్ త‌న తీర్పును భార‌త కాల‌మానం ప్ర‌కారం గురువారం ఉద‌యం 11.30 గంట‌ల వ‌ర‌కు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

Paris Olympics 2024 : అంతిమ్‌ పంగల్‌ అక్రిడిటేషన్‌ రద్దు.. పారిస్‌ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌..?