Paris Olympics 2024 : అంతిమ్‌ పంగల్‌ అక్రిడిటేషన్‌ రద్దు.. పారిస్‌ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌..?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లకు ఏదీ కలిసి రావడం లేదు.

Paris Olympics 2024 : అంతిమ్‌ పంగల్‌ అక్రిడిటేషన్‌ రద్దు.. పారిస్‌ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌..?

Wrestler Antim Panghal

Paris Olympics – Antim Panghal : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లకు ఏదీ కలిసి రావడం లేదు. స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ నిర్ణీత బ‌రువు క‌న్నా 100 గ్రాముల అధిక బ‌రువు ఉన్న కార‌ణంగా అన‌ర్హ‌త వేటు ప‌డింది. తాజాగా భార‌త యువ రెజ‌ర్ల్ అంతిమ్ పంగ‌ల్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆమె త‌న సోద‌రిని ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌ను ఇచ్చి పంపించ‌డ‌మే. ఇప్ప‌టికే ఒలింపిక్స్ నిర్వాహ‌కులు అంతిమ్ అక్రిడిటేష‌న్ ను ర‌ద్దు చేశారు.

వాస్తవానికి వినేష్ ఫొగట్ తలపడాల్సిన 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం నుంచి అంతిమ్ పంగల్ ఒలింపిక్స్‌కు సెలెక్ట్ అయ్యింది. మొద‌టి రౌండ్‌లో 0-10 తేడాతో టర్కీకి చెందిన జైనెప్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ కేవ‌లం 101 సెకెన్లలో ముగిసింది. దీంతో బౌట్ ముగిసిన తర్వాత అంతిమ్ ఒలింపిక్ విలేజ్‌కు వెళ్లకుండా నేరుగా హోటల్ రూమ్‌కి వెళ్లిపోయింది. ఆమెకు సంబంధించిన కొన్ని వ‌స్తువులు ఒలింపిక్ విలేజ్‌లోనే ఉండిపోయాయి. వాటిని తీసుకుర‌మ్మ‌ని త‌న సోద‌రి నిశాకు చెప్పింది. నిశా విలేజ్‌లోకి వెళ్లి వ‌చ్చేందుకు త‌న అక్రిడిటేష‌న్ కార్డును ఇచ్చింది.

Also Read : శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్ ఓట‌మి.. రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. ప్ర‌పంచం మునిగిపోదు..

నిషా విలేజ్‌లోకి అంతిమ్‌లాగా వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ భద్రతా సిబ్బంది ఆమెను గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో వారు వారిద్ద‌రిని పిలిపించి వివ‌ర‌ణ న‌మోదు చేశారు. ఆ త‌రువాత అంతిమ్ త‌న అక్రిడిటేష‌న్‌ను దుర్వినియోగం చేసిన‌ట్లుగా భావించిన నిర్వాహ‌కులు దానిని ర‌ద్దు చేశారు.

కోచ్‌లు అలా..
మరోవైపు అంతిమ్ సపోర్టింగ్ స్టాఫ్ ( ఆమె కోచ్‌లు భగత్ సింగ్, వికాస్) లు విపరీతంగా తాగి క్యాబ్‌లో ప్రయాణించారు. దిగిన త‌రువాత డ‌బ్బులు ఇచ్చేందుకు నిరాక‌రించారు. డ్రైవ‌ర్‌తో గొడ‌వ ప‌డ్డారు. దీంతో డ్రైవ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశౄడు. దీంతో వారిద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : వినేశ్ ఫోగ‌ట్ అన‌ర్హ‌త పై సైనా నెహ్వాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆ ఇద్దరే చెప్పాలి..

ఒకవైపు అంతిమ్ తన సోదరిని తనలా‌ స్పోర్ట్స్ విలేజ్‌లోకి పంపించడం, మరోవైపు అంతిమ్ సపోర్టింగ్ స్టాఫ్ పోలీసు కేసులో ఇరుక్కోవడం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను ఇరుకున‌పెట్టింది. ఐఓసీ, ఫ్రాన్స్ పోలీసులు పై నలుగురిని కూడా ఇండియాకు ‘డీపోర్ట్’ చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఐఓఏకు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

అంతిమ్‌పై వేటు ప‌డితే ఆమె కాంస్య ప‌త‌కం సాధించే అవ‌కాశాన్ని కోల్పోతుంది. క్వార్ట‌ర్స్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి రెపిఛేజ్ ద్వారా పోటీలో నివాల‌నే అంతిమ్ ఆశ‌ల‌కు దీంతో దాదాపుగా తెర‌ప‌డిన‌ట్లే.