త్వరలో జన్మభూమి 2, నామినేటెడ్ పదవుల భర్తీ- టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయాలు

నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు. ఎవరు కష్టపడి పని చేశారో అధినేతకు అన్నీ తెలుసు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధినేత చెప్పారు.

త్వరలో జన్మభూమి 2, నామినేటెడ్ పదవుల భర్తీ- టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయాలు

Tdp Politburo Meeting : టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సుమారు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు. దశల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తానన్నారు. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పేదరిక నిర్మూలనపై పొలిట్ బ్యూరోలో నాయకులు చర్చించారు. అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్, ఆగస్టు 15 అన్న క్యాంటీన్ల ప్రారంభం ఉంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు జిల్లా యూనిట్ గా తీసుకోవాలని నిర్ణయించారు.

నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు- అచ్చెన్నాయుడు
”నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు. ఎవరు కష్టపడి పని చేశారో అధినేతకు అన్నీ తెలుసు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధినేత చెప్పారు. అన్ని పనులు వెంట వెంటనే అయిపోవాలని కార్యకర్తలు గాబరా పడుతున్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలి. పార్టీల వారీగా నామినేటెడ్ పోస్టుల్లో పర్సంటేజ్ లంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తము. కూటమి తరఫున కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తున్నాం. పొలిట్ బ్యూరోలో 55 రోజుల పాలనపై చర్చించాము. త్వరలో జన్మభూమి 2 ప్రారంభం కాబోతుంది. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి.

వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులు నిండటంతో జగన్ గుండె నీరుకారుతోంది. నామినేటెడ్ పోస్టులు అతి త్వరలో భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత మరోసారి హెచ్చరించారు. జనాభా నియంత్రణ వలన డీలిమిటేషన్ లో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతోంది. ఒక్క యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారత దేశంలో 160 మాత్రమే ఉంటాయి. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయి” అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Also Read : శత్రుత్వానికి బైబై..! పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం..!