Vinesh Phogat : నిబంధనలు ఇవే.. వినేశ్ ఫోగట్ స్థానంలో ఫైనల్‌కు వెళ్లేది ఆమెనే..?
ఫోగట్ పై అనర్హత వేటు పడడంతో హిల్డర్ బ్రాంట్‌కు నేరుగా స్వర్ణ పతకం ఇస్తారా..? రజతం ఎవరికి ఇస్తారు..? ఫోగట్ స్థానంలో మరెవరికి అయిన అవకాశం ఇస్తారా..? అన్న ప్రశ్నలకు తెరపడింది.

How will medals decided after vinesh phogats disqualification from event at paris olympics
Vinesh phogat disqualification : పారిస్ ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్. ఈ క్రమంలో ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరుకున్న మొదటి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అయితే.. అనూహ్యంగా ఆమె పై అనర్హత వేటు పడింది. ఫోగట్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడింది. వేటు పడకపోయి ఉంటే ఆమె బుధవారం ఫైనల్ బౌట్‌లో అమెరికాకు చెందిన హిల్డర్ బ్రాంట్‌తో పోటీపడాల్సి ఉంది.
ఇప్పుడు ఫోగట్ పై అనర్హత వేటు పడడంతో హిల్డర్ బ్రాంట్‌కు నేరుగా స్వర్ణ పతకం ఇస్తారా..? రజతం ఎవరికి ఇస్తారు..? ఫోగట్ స్థానంలో మరెవరికి అయిన అవకాశం ఇస్తారా..? అన్న ప్రశ్నలకు తెరపడింది. దీనిపై ఒలింపిక్స్ కమిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
Vinesh Phogat : వినేశ్ ఫోగట్ అనర్హత పై ఆనంద్ మహీంద్రా సంచలన పోస్ట్..
అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలలోని ఆర్టికల్ 11 ప్రకారం బరువు ప్రమాణాలను అందుకోని రెజర్ల్ పై అనర్హత వేటు వేస్తారు. అంతేకాదు.. ఆ పోటీల్లో సదరు ప్లేయర్‌కు ఆఖరి స్థానాన్ని కేటాయిస్తారు. వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడడంతో ఆమెకు ఆఖరి స్థానాన్ని కేటాయించారు. దీంతో ఆమెకు ఎలాంటి పతకం రాదు. సెమీ ఫైనల్‌లో వినేశ్ చేతిలో ఓడిపోయిన రెజ్లర్‌కు ఆమె స్థానంలో అవకాశం కల్పిస్తారు. ఈ లెక్కన సెమీలో వినేశ్ చేతిలో ఓడిపోయిన గుజ్మన్ లోపేజ్ (క్యూబా) ఫైనల్ బౌట్‌లో అమెరికాకు చెందిన హిల్డర్ బ్రాంట్‌తో తలపడనుంది.
‘వినీష్ రెండో రోజు బరువులో విఫలమైంది. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలలోని ఆర్టికల్ 11 ప్రకారం.. సెమీఫైనల్‌లో ఆమెతో ఓడిపోయిన రెజ్లర్.. వినేష్ స్థానంలో ఉంటుంది. అందువల్ల యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్ ఫైనల్‌లో పోటీపడనుంది.’ అని పారిస్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
Vinesh Phogat : వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు.. మహావీర్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు..
ఇక ఫైనల్ బౌట్ భారత కాలమానం ప్రకారం నేటి (బుధవారం) రాత్రి 11.23 గంటలకు ఆరంభం కానుంది. ఇక కాంస్య పతకం కోసం జపాన్ క్రీడాకారిణి సుసాకీ, ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సాన తలపడనున్నారు.