ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్
భూపాల్ రెడ్డి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
![ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్](https://10tv.in/wp-content/uploads/2024/08/Additional-Collector-Arrest.jpg)
Additional Collector Arrest : ఆయన అడిషనల్ కలెక్టర్. ఉన్నత పదవి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారి. అలాంటి ఆఫీసరే అడ్డదారిలో వెళ్లాడు. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదో.. ఏమో.. లంచాలకు రుచి మరిగాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 16 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు.