నేను ప్రచారంకోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు.. హరీశ్ రావు వ్యాఖ్యలపట్ల మంత్రి తుమ్మల ఆవేదన
తాను ప్లెక్సీలకోసం క్రెడిట్ కోసం ఏనాడూ ఆరాటపడలేదన్న తుమ్మల.. జిల్లా ప్రజలకు సేవచేస్తున్న తనపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు.

Thummala Nageswara Rao
Thummala Nageswara Rao : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. ప్రచారంకోసం బటన్ నొక్కే వ్యక్తిని నేను కాదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పిలుపుతో నేను రాజకీయాల్లోకి వచ్చానని, ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రిగా కొనసాగానని చెప్పారు. శ్రీరామ చంద్రుడి దయవల్ల, ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో అనేక దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అయితే, ఖమ్మం జిల్లా నుంచి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న గోదావరి నది నుంచి మన భూభాగానికి నీళ్లు తెచ్చుకోలేక పోయామని, గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనేది నా సంకల్పం అని అన్నారు.
Also Read : Visakha MLC By-Election : విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా కూటమి
తాను ప్లెక్సీలకోసం క్రెడిట్ కోసం ఏనాడూ ఆరాటపడలేదన్న తుమ్మల.. జిల్లా ప్రజలకు సేవచేస్తున్న తనపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదంటూ మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం అన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలు బాధపెట్టాయని, తాను ప్రచారం కోసం బటన్ నొక్కే పనులు చేయలేదన్నారు. తాను ప్రేక్షకుడిగా మాత్రమే నిలబడ్డానని, తాను క్రెడిట్ కోసం పాకులాడే మనిషిని కాదని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద తనకు ఎకరం పొలం కూడా లేదన్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశంతో వెంసూరుకు తమ్మిలేరుకు, ఎన్టీఆర్ కెనాల్ తో సాగునీళ్లు అందిస్తున్నారు. అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో 32 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు నేను చేశాను. పాలేరు కరువుకు శాశ్వత పరిష్కారంగా భక్తరామదాసు లిఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశా. నేను నిర్మాణం చేసిన సాగు నీటి ప్రాజెక్టులపై రైతాంగం సంతోషంగా ఉన్నారని తుమ్మల అన్నారు.