జోగి రమేశ్‌కు మరో బిగ్ షాక్..! ఆ కేసులో పోలీసుల నోటీసులు..

ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఆయనకు మరో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.

జోగి రమేశ్‌కు మరో బిగ్ షాక్..! ఆ కేసులో పోలీసుల నోటీసులు..

Updated On : August 13, 2024 / 4:29 PM IST

Jogi Ramesh : చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో జోగి రమేశ్ విచారణకు వెళ్లనున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన కేసులో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే ఆయనకు మరో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇప్పటికే మంగళగిరి పోలీసులు జోగి రమేశ్ కు నోటీసులు ఇచ్చారు. నిన్న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఆయన నిన్న విచారణకు రాలేనని చెప్పారు. ఇవాళ విచారణకు హాజరవుతానని అన్నారు. ఇంతలో అగ్రిగోల్డ్ భూముల స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేశారు. దీంతో జోగి రమేశ్ కు బిగ్ షాక్ తగిలింది. రాజీవ్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అదే ప్రాంతంలో జోగి రమేశ్ ఉన్నారు. అయితే, విచారణకు రావాలని మంగళగిరి డీఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

జోగి రమేశ్ తో పాటు ఆయన అనుచరులు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. దాడి చేయడానికి ఎందుకు వెళ్లారు? మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారని తెలుస్తోంది. ఈ దాడి సమయంలో చంద్రబాబుపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా పోలీసుల వద్ద వీడియో రికార్డులు కూడా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? బయటకు వస్తే చంపుతాను అంటూ జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే విచారణకు సంబంధించి జోగి రమేశ్ కు ఒక అవకాశం అయితే ఇచ్చారు పోలీసులు. నిన్న విచారణకు రావాలని ఆదేశించగా, ఇవాళ విచారణకు వస్తానని జోగి రమేశ్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కనుక ఆయన విచారణకు హాజరుకాకపోతే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందేనని మంగళగిరి పోలీసులు జోగి రమేశ్ కు తేల్చి చెప్పారు. ఆయన రాక కోసం వారు వేచి చూస్తున్నారు.

Also Read : అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం.. పూర్తి వివరాలు తెలిపిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత