శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్.. వారికి నో ఎంట్రీ..
రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

Shamshabad Airport
Shamshabad Airport : రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రయాణికులతో సందర్శకులు వెళ్లేందుకు అనుమతి లేదు. విజిటర్స్ పాసులు ఆగస్టు 16 వరకు రద్దు చేశారు.
Also Read : వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిలో ఏసీబీ సోదాలు
మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రతిరోజు పదివేలకుపైగా విద్యార్థులు వెళ్తున్నారు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఒక వ్యక్తికి 30 నుంచి 40 మంది వస్తున్న పరిస్థితి. దీంతో విమానాశ్రయంలో మరింత రద్దీ పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు.