వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిలో ఏసీబీ సోదాలు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ..

Jogi Ramesh
YCP Leader Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున అధికారులు జోగి రమేశ్ నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో 15మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పలు రికార్డులను, ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ఎవర్నీ బయట నుంచి ఇంట్లోకి రానివ్వకుండా.. ఇంట్లో ఉన్నవారిని బయటకు వెళ్లనివ్వకుండా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిన ఘటనలో నిందితులుగా జోగి రమేశ్ ఉన్నారు. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ కోసం ఇప్పటికే జోగి రమేశ్ హైకోర్టును ఆశ్రయించాడు.
Also Read : శంషాబాద్ విమనాశ్రయంలో హై అలర్ట్.. వారికి నో ఎంట్రీ..