Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లోకి ఎంట్రీ తరువాత ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump and Elon Musk

Donald Trump interview In X : అమెరికాలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ (ట్విటర్)లోకి ఎంట్రీ ఇచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన రెండు నెలల తరువాత ఆయన మద్దతు దారులు 6 జనవరి 2021న వాషిగ్టన్ లోని యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి చేశారు. ఈ హింస నేపథ్యంలో ట్రంప్ ఖాతాపై అప్పటి ట్విటర్ యాజమాన్యం నిషేధాన్ని విధించింది. ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసిన తరువాత ట్రంప్ ఖాతాపై నిషేధాన్ని ఎత్తివేశారు. అయినా ట్రంప్ ట్విటర్ లోకి వచ్చేందుకు నిరాకరించారు. తాజాగా.. నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో ట్రంప్ మళ్లీ ఎక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ పలు పోస్టులు చేశారు.

Also Read : ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భారత్‌కు కష్టకాలమేనా.. ట్రంప్ విధానాలు మనకు ఇబ్బందిగా మారనున్నాయా?

డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లోకి ఎంట్రీ తరువాత ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.30 గంటలకు (అమెరికాలో రాత్రి 8గంటలు) ఇంటర్వ్యూ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్యల కారణంగా ఇంటర్వ్యూ ఆలస్యమైంది. సుమారు 40 నిమిషాల ఆలస్యం తరువాత ట్రంప్ తో మస్క్ ఇంటర్వ్యూ ప్రారంభమైంది. ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటన గురించి మస్క్ అడగడం ద్వారా ట్రంప్ తో ఇంటర్వ్యూ ప్రారంభించాడు. దీనికి ట్రంప్ సమాధానమిస్తూ.. అది బుల్లెట్ అని నాకు వెంటనే తెలుసు. అది చెవిని తాకిందని నాకు వెంటనే అర్ధమైందని ట్రంప్ చెప్పాడు. అదేవిధంగా అక్రమ వలసలపై ట్రంప్ ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఉదాసీనత కారణంగా హంతకులు డ్రగ్ డీలర్లు యూఎస్ లోకి అడుగు పెడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. అక్రమ వలసలపై ట్రంప్ ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఉదాసీనత కారణంగా హంతకులు డ్రగ్ డీలర్లు యూఎస్ లోకి అడుగు పెడుతున్నారని ట్రంప్ ఆరోపించారు.

Also Read : 20 ఏళ్లు తిరుగులేకుండా బంగ్లాను ఏలిన ఐరన్‌లేడీ.. తండ్రి తెచ్చిన రిజర్వేషన్లతోనే తనయకు సమస్యలు!

ఉక్రెయిన్ పై రష్యా దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైఖరే కారణమని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ లేకుంటే రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసి ఉండేది కాదని అన్నారు. పుతిన్ తో నేను బాగా సఖ్యతగా ఉంటాను. ఆయన నన్ను చాలా గౌరవించారు. ఉక్రెయిన్ పై దాడి గురించి మాట్లాడినప్పుడు అలా చేయొద్దని పుతిన్ కు నేను చెప్పాను అని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా, చైనా, ఉత్తరకొరియా అధినేతలు తమ ఆటలో అగ్రస్థానంలో ఉన్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. పుతిన్, జిన్ పింగ్, కిమ్ ను అడ్డుకోవాలంటే అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.

 

ఎలాన్ మస్క్ – డోనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ: వినండి