Janhvi Kapoor : అమ్మ పుట్టిన రోజున.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తిరుమలలో జాన్వీ కపూర్ సందడి..

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన తల్లి దివంగత నటి శ్రీదేవి ప్రతి పుట్టిన రోజున తిరుమల వస్తుందని తెలిసిందే.

Janhvi Kapoor : అమ్మ పుట్టిన రోజున.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తిరుమలలో జాన్వీ కపూర్ సందడి..

Janhvi Kapoor Visited Tirumala With her Rumoured Boy Friend Shikhar Pahariya on the Occasion of Sridevi Birthday

Updated On : August 13, 2024 / 4:06 PM IST

Janhvi Kapoor : బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన తల్లి దివంగత నటి శ్రీదేవి ప్రతి పుట్టిన రోజున తిరుమల వస్తుందని తెలిసిందే. శ్రీదేవికి తిరుపతి అంటే ఇష్టమని, ఎప్పుడు కుదిరినా తిరుమల వచ్చి దర్శనం చేసుకునేది, అందుకే ఆమె చనిపోయిన తర్వాత నుంచి ఆమె జ్ఞాపకార్థం శ్రీదేవి ప్రతి పుట్టిన రోజుకి తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటుందని గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపింది జాన్వీ.

Also Read : Harish Shankar : స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారన్న పవన్ వ్యాఖ్యలపై.. స్పందించిన డైరెక్టర్ హరీష్ శంకర్..

తాజాగా నేడు శ్రీదేవి పుట్టిన రోజు కావడంతో జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి తిరుమలకు కాలినడకన వెళ్లి నేడు ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. తిరుమలలో జాన్వీ కపూర్, శిఖర్ పహార్ దర్శనం చేసుకొని గుడి నుంచి బయటకు వచ్చిన విజువల్స్ వైరల్ గా మారాయి. జాన్వీ పద్దతిగా చీర కట్టుకోగా శిఖర్ పహారియా పంచె, కండువా వేసుకున్నాడు.

జాన్వీ కపూర్ తన తల్లితో దిగిన చిన్నప్పటి ఫోటోతో పాటు, తిరుమల కాలినడక మెట్లను, తిరుమలలో తాను దిగిన ఫోటోని షేర్ చేసి హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక రూమర్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో రావడంతో వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)