Fact check: ఈ మువ్వన్నెల జెండా చిక్కుముడిని పక్షి నిజంగానే విప్పిందని అనుకుంటున్నారా?

జెండా కాసేపు ఇరుక్కుపోయిన విషయం నిజమే.. కానీ, ఆ జెండా చిక్కుముడిని పక్షి..

Fact check: ఈ మువ్వన్నెల జెండా చిక్కుముడిని పక్షి నిజంగానే విప్పిందని అనుకుంటున్నారా?

Viral Video: స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేరళలో అద్భుతం చోటుచేసుకుందంటూ ఓ పక్షికి చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జాతీయ జెండాను ఎగురవేసిన సమయంలో అది పోల్ చివరి భాగంలో చిక్కుకుపోగా ఓ పక్షి వచ్చి ఆ చిక్కును విప్పి మువ్వన్నెల జెండాను గాలిలోకి ఎగిరేలా చేసిందని చాలా మంది అనుకుంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో నిజం లేదు. జెండా కాసేపు ఇరుక్కుపోయిన విషయం నిజమే.. కానీ, ఆ జెండా చిక్కుముడిని పక్షి విప్పలేదు. పక్షి వచ్చి చెట్టు ఆకులపై వాలుతుంది.. అది కెమెరా యాంగిల్‌ వల్ల పక్షే జెండా చిక్కుముడిని విప్పినట్లు కనపడుతోంది.

చెట్టుకొమ్మపై వాలిన పక్షి.. అక్కడి వారు జెండాను ఆవిష్కరించాక ఎగిరిపోవడం వల్ల అలా కనపడింది. మరో యాంగిల్లో తీసిన వీడియోలో అసలు ఆ పక్షి జెండాను ముట్టుకోలేదని, అది చెట్టు ఆకులపైనే ఉందని స్పష్టంగా గమనించవచ్చు. వైరల్ అయిన వీడియోను, ఒరిజినల్‌ వీడియోను చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం అవుతుంది.

Also Read: వినేశ్‌ ఫొగాట్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం.. కన్నీరు పెట్టుకున్న రెజ్లర్.. ఓదార్చిన కాంగ్రెస్ ఎంపీ, సన్నిహితులు