‘అన్‌స్టాపబుల్’ వేదికగా బాలకృష్ణ, చిరంజీవి మల్టీస్టారర్ మూవీ అనౌన్స్?

బాలయ్యకు, చిరుకు నచ్చేలా స్క్రిప్ట్‌ రెడీ చేసిన ఆ దర్శకుడు ఎవరనేది..

‘అన్‌స్టాపబుల్’ వేదికగా బాలకృష్ణ, చిరంజీవి మల్టీస్టారర్ మూవీ అనౌన్స్?

ఆహాలో సూపర్ సక్సెస్ అయిన ప్రోగ్రామ్ అన్‌స్టాపబుల్. ఇప్పటికే రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న షో..ఇప్పుడు అన్‌స్టాపబుల్-3గా రాబోతుంది. ఈసారి భారీగానే సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయడం. అందుకే బాలకృష్ణ టైమ్ ఇచ్చినప్పుడే ఈ ప్రోగ్రామ్‌ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలక్షన్స్, సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ టైమ్ ఇవ్వటంతో అన్ స్టాపబుల్-3కి ప్లాన్ చేస్తున్నారు ఆహా మేనేజ్‌మెంట్‌.

అన్‌స్టాపబుల్ సీజన్‌-1, సీజన్‌-2లో చిరంజీవి పార్టిసిపేట్ చేస్తారని చాలా ప్రచారం జరిగింది. కానీ అది కుదరలేదు. అన్‌స్టాపబుల్‌-3లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా అటెండ్‌ అవుతారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రోగ్రామ్‌లోనే బాలకృష్ణ, చిరంజీవి మరో బిగ్ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్లు తెలస్తోంది. అన్‌స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ, చిరంజీవి మల్టీస్టారర్ మూవీని అనౌన్స్ చేస్తారని టాక్. బుల్లితెరపైనే కాదు, వెండితెరపై కూడా ఇద్దరు మెరిస్తే ఇక దుమ్ము దుమారమే అంటున్నారు ఇద్దరి ఫ్యాన్స్.

వీరిద్దరితో మల్టీస్టారర్ సినిమా తీయాలని చాలామంది దర్శకులు, నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ సరైన కథ దొరక్కపోవడంతో ఆ ప్రయత్నం పట్టాలెక్కలేదు. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రం చిరు, బాలయ్యతో తీస్తే బాగుండేదని ఎంతోమంది డైరెక్టర్లు భావించారు. కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్ లాంటి దర్శకులు కూడా బాలయ్య, చిరంజీవితో మల్టీస్టారర్ చేయాలని అనుకున్నా వర్కౌట్ కాలేదు. అన్నీ స్టోరీ డిస్కషన్ దగ్గరే ఆగిపోయాయి.

వీరిద్దరూ మహామహులే..
ఎంతమంది హీరోలు టాలీవుడ్‌లో కొత్తగా వచ్చినా.. రికార్డులు బద్దలు కొట్టినా.. అటు మెగాస్టార్ ఇటు నటసింహం బాలయ్య క్రేజ్ మాత్రం మ్యాచ్ చేయలేరనే చెప్పొచ్చు. వీరిద్దరూ మహామహులే. కానీ ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదనే వెలతి ఫ్యాన్స్‌లో ఉండిపోయింది. వెండితెరపై ఓవైపు మెగాస్టార్‌ని..మరోవైపు బాలయ్యని చూస్తూ ఎంజాయ్ చేయాలని అందరికి ఉంటుంది. ప్రస్తుతం వరుసగా హిట్లు కొడుతూ బాలయ్య దూసుకువెళ్తుండగా..విశ్వంభర చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఇద్దరే. అభిమానులు, సినిమాలు, రికార్డులు అన్ని విషయాల్లోనూ ఒకరితో ఒకరికి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఈ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులకు పండగే. థియేటర్స్ వద్ద రచ్చ చేయాల్సిందే. అయితే వీరిద్దరూ కలసి నటంచే సినిమా అంటే ఫ్యాన్స్ అంచనాలు వేరే లెవల్‌లో ఉంటాయి.

అన్‌స్టాపబుల్‌ షో వేదికగా వీరు ప్రకటించే మల్టీస్టారర్‌ మూవీకి డైరెక్టర్‌ ఎవరు? ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరు? బాలయ్యకు, చిరుకు నచ్చేలా స్క్రిప్ట్‌ రెడీ చేసిన ఆ దర్శకుడు ఎవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అన్‌స్టాపబుల్‌ వేదికగా మల్టీస్టారర్‌ మూవీ డిటెయిల్స్ అన్నీ ప్రకటిస్తారా..లేక ఇద్దరం కలసి సినిమా చేస్తున్నామని మాత్రమే అనౌన్స్ చేస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : బిగ్ బాస్ సీజన్ 8 డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి మొదలు అంటే..