Chandini – Rashmika – Meenakshi : మొన్న చాందిని.. ఇప్పుడు మీనాక్షి.. తర్వాత రష్మిక.. అందరికి భలే కుదురుతుంది..

ఇటీవల హీరోయిన్ చాందిని చౌదరి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో రష్మిక, మీనాక్షి చౌదరి కూడా జాయిన్ అవుతున్నారు.

Chandini – Rashmika – Meenakshi : మొన్న చాందిని.. ఇప్పుడు మీనాక్షి.. తర్వాత రష్మిక.. అందరికి భలే కుదురుతుంది..

Chandini Chowdary Meenakshi Chaudhary Rashmika Mandanna Creates New Record with Their Movie Releases

Chandini – Rashmika – Meenakshi : హీరో లేదా హీరోయిన్స్ వి తమ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం చాలా అరుదు. కానీ ఇప్పుడు అది మాములు విషయం అయిపోయేలా ఉంది. ఇటీవల హీరోయిన్ చాందిని చౌదరి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో రష్మిక, మీనాక్షి చౌదరి కూడా జాయిన్ అవుతున్నారు.

చాందిని చౌదరి ఇటీవల నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. జూన్ 14న ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండిట్లోనూ చాందిని మెయిన్ లీడ్ కావడం గమనార్హం. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి హిట్ అవ్వగా యేవమ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే త్వరలో మీనాక్షి చౌదరి, రష్మికకి కూడా రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజయ్యే పరిస్థితి ఏర్పడింది.

Also Read : Kiran Abbavaram – Rahasya Gorak : పెళ్లికొడుకుగా కిరణ్.. పెళ్లికూతురిగా రహస్య.. రేపే పెళ్లి..

ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా వరుస సినిమాలు తెచ్చుకుంటూ దూసుకుపోతుంది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి, విశ్వక్ సేన్ జంటగా నటించిన మెకానిక్ రాకీ సినిమా అక్టోబర్ 31న దీపావళికి రిలీజ్ కాబోతుంది. అయితే అదే రోజు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా కూడా రిలీజ్ కాబోతుండటం గమనార్హం. మొదట లక్కీ భాస్కర్ సినిమా సెప్టెంబర్ అనుకున్నా అనుకోని కారణాలతో వాయిదా పడి దీపావళికి అక్టోబర్ 31న రిలీజ్ కానుంది.

ఇక నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మికకు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుంది. అయితే అదే రోజు రష్మిక, విక్కీ కౌశల్ జంటగా నటించిన చావా సినిమా రిలీజ్ అవుతుంది. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవిత కథతో పీరియాడిక్ సినిమాగా చావా తెరకెక్కింది.

Also Read : Chiranjeevi – Balakrishna : ఏకంగా 11వ సారి చిరంజీవి – బాలకృష్ణ సంక్రాంతి పోటీ.. విశ్వంభర వర్సెస్ NBK 109..?

ఇలా రెండు సినిమాలు ఒకే రోజు రిలీజవుతున్నందుకు సంతోషంగా ఉన్నా ప్రమోషన్స్ కి రెండిటికి సమయం ఇవ్వాలి, అలాగే ఏ సినిమా హిట్ అవుద్దో, ఏ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని రెండు సినిమాల గురించి ఒకేసారి కంగారుపడాలి. ఇవి అనుకోని ప్లాన్ చేయకపోయినా అనుకోకుండా రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రావడం విశేషమే. ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసే లిస్ట్ లో ఇంకెవరు చేరతారో చూడాలి.