WhatsApp Voice Note : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై వాయిస్ నోట్ ట్రాన్స్‌స్ర్కిప్ట్ చేయొచ్చు!

WhatsApp Voice Note : వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాయిస్ నోట్స్ వెంటనే రాయగలదు. ఈ ఫీచర్ వల్ల వాయిస్ నోట్‌లో ఏం చెప్పినా నోట్ చేసుకోవడం ద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది.

WhatsApp Voice Note : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై వాయిస్ నోట్ ట్రాన్స్‌స్ర్కిప్ట్ చేయొచ్చు!

WhatsApp rolls out voice note transcripts for Android ( Image Source : Google )

WhatsApp Voice Note : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. చాలా కాలంగా ఇన్-చాట్ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను టెస్టింగ్ చేసింది. ఇప్పుడు ఆ ఫీచర్ ఎట్టకేలకు ప్రవేశపెట్టింది. ఇకపై వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ కోసం థర్డ్-పార్టీ యాప్‌పై ఆధారపడాల్సిన పనిలేదు. గో-టు-మెసెంజర్ యాప్ ఈ ఫీచర్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తోంది.

Read Also : Best Mobile Phones : ఈ ఆగస్టులో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ఇటీవలి అప్‌డేట్ ప్రకారం.. వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాయిస్ నోట్స్ వెంటనే రాయగలదు. ఈ ఫీచర్ వల్ల వాయిస్ నోట్‌లో ఏం చెప్పినా నోట్ చేసుకోవడం ద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ఇతర లాంగ్వేజీలతో పాటు హిందీలో కూడా వాయిస్ నోట్‌ని ట్రాన్స్‌స్ర్కిప్ట్ చేయగలదు. ఈ ఫీచర్ భారతీయులకు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్ట్ ఎలా వాడాలంటే? :
వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్‌ని చాట్‌లలో యాక్సెస్ చేయవచ్చు. యాప్ సెట్టింగ్‌ల ద్వారా ఎనేబుల్ చేయవచ్చు. ఫీచర్ మొబైల్ యాప్‌కు ప్రత్యేకమైనది. వెబ్ వెర్షన్‌కు సపోర్టు ఇవ్వదు. ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, హిందీ అనే 5 భాషలలో అందుబాటులో ఉంది. వినియోగదారులు వారి ఫోన్‌లలో నేరుగా వాయిస్ నోట్స్‌ని పొందడానికి అనుమతిస్తుంది.

ఫీచర్‌ని యాక్టివేట్ చేయాలంటే? :
మీ వాట్సాప్ యాప్‌లోని సెట్టింగ్‌ ఎంచుకోండి. చాట్‌పై క్లిక్ చేయండి. ఫీచర్‌ని యాక్టివేట్ చేసేందుకు టోగుల్ బార్ కనిపిస్తుంది. యాక్టివేట్ చేసిన తర్వాత వాయిస్ నోట్స్ దిగువన ట్రాన్స్‌క్రిప్షన్ ప్రాంప్ట్ కనిపిస్తుంది. వినియోగదారులు ప్రాసెస్‌ను మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ టెక్స్ట్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది. అసలు వాయిస్ నోట్ కింద ట్రాన్స్‌క్రిప్షన్ రిజల్ట్స్ డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు, యాక్టివేట్ చేసిన తర్వాత ఫీచర్ ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు చూద్దాం. మీరు వాయిస్ నోట్‌ను పొందిన తర్వాత మీరు వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ చేస్తారా? లేదా అనేదాని గురించి కూడా ఆప్షన్ అందిస్తుంది.

మీరు ఫీచర్ యాక్టివ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ట్రాన్స్‌క్రిప్షన్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది. వాయిస్ నోట్‌లోని టెక్స్ట్ వాయిస్ నోట్ కింద కనిపిస్తుంది. వ్యక్తిగత వాయిస్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. పంపినవారు, మెసేజ్ పొందినవారు మాత్రమే వాటిని యాక్సెస్ చేయగలరు. వాట్సాప్ కూడా మెసేజ్‌లను వినదు, చదవదు. అదనంగా, ట్రాన్స్క్రిప్షన్ టెక్స్ట్ ఫైల్ ప్రైవేట్, షేర్ చేయదు. యాప్ ప్రైవసీ ఫీచర్లను మరింత మెరుగుపరుస్తుంది.

వాట్సాప్ యూజర్లకు త్వరలో డిఫాల్ట్ థీమ్‌ ఫీచర్ :
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. యాప్‌లో డిఫాల్ట్ థీమ్‌ను ఎంచుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ థీమ్ ఫోన్ సెట్టింగ్‌తో సంబంధం లేకుండా ఉంటుంది. ఇప్పటివరకు, వాట్సాప్ థీమ్ ఫోన్ డిఫాల్ట్ థీమ్‌తో సింకరైజ్ అయి ఉంటుంది. ఈ ఫోన్ డార్క్ థీమ్‌లో ఉంటే.. యాప్ కూడా డార్క్‌గా మారుతుంది. ఫోన్ సెట్టింగ్ లైట్ థీమ్‌లో ఉంటే.. వాట్సాప్ కూడా అదే థీమ్‌ను డిస్‌ప్లే చేస్తుంది. అయితే, రాబోయే ఫీచర్లతో వినియోగదారులు యాప్ కోసం థీమ్‌ను వ్యక్తిగతంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

Read Also : Tech Tips Telugu : మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ 10 టిప్స్ తప్పక పాటించండి!