Aadhaar Address Update : మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా అప్‌‌డేట్ చేసుకోవాలో తెలుసా? పూర్తి ప్రాసెస్ మీకోసం..!

Aadhaar Address Update : ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సులభంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ గతంలో కన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..

Aadhaar Address Update : మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా అప్‌‌డేట్ చేసుకోవాలో తెలుసా? పూర్తి ప్రాసెస్ మీకోసం..!

Tech Tips in Telugu _ How to update address on your Aadhaar Card

Updated On : August 21, 2024 / 12:24 AM IST

Aadhaar Address Update : మీ ఆధార్ కార్డులోని అడ్రస్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తున్నారా? వాస్తవానికి, ఆధార్ అనేది ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డు మాత్రమే కాదు. వివిధ సర్వీసులు, ప్రయోజనాలను యాక్సెస్ చేసే కీలకమైన డాక్యుమెంట్ కూడా. మీరు ఇటీవల మరో ఇంటికి మారినట్టయితే.. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో మీ ఆధార్ అడ్రస్ ఎలా అప్‌డేట్ చేయాలనేది ఇప్పుడు పూర్తి వివరణతో తెలుసుకుందాం.

ఆన్‌లైన్ విధానం :
1. మైఆధార్ పోర్టల్‌ని విజిట్ చేయండి : అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్‌కి వెళ్లండి. (https://myaadhaar.uidai.gov.in/) మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
2. అడ్రస్ అప్‌డేట్ నావిగేట్ చేయండి :myaadhaar’ ట్యాబ్‌ని ఆపై ‘Udate Aadhaar’ ఆప్షన్ ట్యాప్ చేసి ఆ తర్వాత ‘Update Address Online’ బటన్ నొక్కండి.
3. మీ అడ్రస్ వివరాలను ఎంటర్ చేయండి : ఇంటి నంబర్/పేరు, వీధి, ప్రాంతం, గ్రామం/పట్టణం, జిల్లా, రాష్ట్రం, పిన్ కోడ్‌తో సహా మీ కొత్త అడ్రస్ సమాచారంతో ఫారమ్‌ను నింపండి. మీ అడ్రస్ ప్రూఫ్ కచ్చితత్వం, స్థిరత్వాన్ని నిర్ధారించుకోండి.

Read Also : JioAirFiber Offer : జియోటీవీ+ టూ-ఇన్-వన్ ఆఫర్ : ఒకే కనెక్షన్‌తో రెండు టీవీల్లో కంటెంట్ చూడొచ్చు!

4. అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి : మీ పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా యుటిలిటీ బిల్లు (3 నెలల కన్నా పాతది కాదు) వంటి అడ్రస్ డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యే రుజువును స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
5. ప్రివ్యూ, సబ్మిట్ : నమోదు చేసిన అన్ని వివరాలు, ప్రూఫ్ డాక్యుమెంట్లను జాగ్రత్తగా రివ్యూ చేయండి. సంతృప్తి చెందిన తర్వాత ‘Submit’ అప్‌డేట్ రిక్వెస్ట్ పంపవచ్చు.
6. మీ అప్‌డేట్ ట్రాక్ చేయండి: మీరు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN)ని అందుకుంటారు. మైఆధార్ పోర్టల్‌లో మీ అడ్రస్ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ URNని ఉపయోగించండి.

Tech Tips in Telugu _ How to update address on your Aadhaar Card

How to update address Aadhaar Card

ఆఫ్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
1. ఆధార్ సర్వీసు సెంటర్ సందర్శించండి : మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని (ASK) గుర్తించండి. ఆధార్ సర్వీసుల కోసం నియమించిన సెంటర్ ఇది. మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో (ASK) జాబితాను కనుగొనవచ్చు.
2. ఆధార్ అప్‌డేట్ ఫారమ్‌ను నింపండి : యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఆధార్ అప్‌డేట్ ఫారమ్ (ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అప్‌డేట్ ఫారమ్) డౌన్‌లోడ్ చేసి నింపండి. మీరు ఏఎస్‌కే వద్ద కూడా పొందవచ్చు.
3. ఫారమ్, డాక్యుమెంట్లను సమర్పించండి: ఏఎస్‌కే అధికారులకు చెల్లుబాటు అయ్యే అడ్రస్ ప్రూఫ్‌తో పాటు పూర్తి చేసిన ఫారమ్‌ను సమర్పించండి.
4. బయోమెట్రిక్ వెరిఫికేషన్ : అథెంటికేషన్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్) చేయించుకోండి.
5. అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ : మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN)ని కలిగి ఉన్న రసీదు స్లిప్‌ను పొందవచ్చు. మీ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి లేదా యూఐడీఏఐ హెల్ప్‌లైన్ (1948)కి కాల్ చేయడం ద్వారా ఈ ఎస్ఆర్ఎన్ ఉపయోగించండి.

అదనపు టిప్స్ మీకోసం :

  • ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందా? SMS నోటిఫికేషన్‌లు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.
  • మీ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను అందుబాటులో ఉంచుకోండి.
  • మీ అప్‌డేట్ అభ్యర్థనను ఆన్‌లైన్‌లో సమర్పించే ముందు దాన్ని పూర్తిగా రివ్యూ చేయండి.
  • అడ్రస్ అప్‌డేట్ ప్రాసెస్‌కు 90 రోజులు పట్టవచ్చు. అప్పటివరకూ ఓపికపట్టండి.
  • పైన పేర్కొన్న విధంగా మీ ఆధార్ అడ్రస్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
  • మీ ఆధార్ సమాచారాన్ని కచ్చితమైనదిగా ఉండటం వల్ల వివిధ ప్రభుత్వ సర్వీసులు, ప్రయోజనాలు పొందవచ్చు.

Read Also : WhatsApp Username : వాట్సాప్‌లో ప్రైవసీ ఫీచర్.. పిన్ సపోర్టుతో యూజర్‌నేమ్‌.. ఇక ఫోన్ నెంబర్ అక్కర్లేదు..!