Russia : రష్యాలోని 38 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. వీడియోలు వైరల్

రష్యాలోని సరతోవ్ ప్రాంతంలోని రెండు ప్రధాన నగరాల్లో ఉక్రెయిన్ సోమవారం అనేక డ్రోన్ దాడులు చేసిందని మాస్కోలోని ఆగ్నేయ ప్రాంత గవర్నర్ రోమన్ బసుర్గిన్ తెలిపారు.

Russia : రష్యాలోని 38 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. వీడియోలు వైరల్

Drone Crashes into 38-Storey High Rise Building in Russia

Drone Crashes in Russia : రష్యాలో 38 అంతస్తుల ఎత్తైన భవనంపై సోమవారం డ్రోన్ దాడి జరిగింది. ఎగిరే డ్రోన్ నేరుగా వచ్చి భవనాన్నిఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతుతున్నారు. ఈ ఘటన సరతోవ్ నగరంలోని ఎత్తైన 38 అంతస్తుల వోల్గా స్కైలో జరిగింది.

Also Read : viral Video : హెజ్‌బొల్లా ఉగ్రదాడులను ఇలా తిప్పికొట్టాం.. వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

ఎత్తైన భవనాన్ని డ్రోన్ ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో ప్రకారం.. డ్రోన్ ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. అది నేరుగా 38 అంతస్తుల ఎత్తైన భవనంను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని మూడు అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. డ్రోన్ దాడి కారణంగా భవనంలోని కిటికీల అద్దాలు పగలడంతో కింద పార్కింగ్ చేసిన 20కిపైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి.

Also Read : Crime News : భార్య అతిగా ఖర్చు చేయడాన్ని తట్టుకోలేక పోయిన భర్త.. అరెస్టు చేసిన పోలీసులు..

రష్యాలోని సరతోవ్ ప్రాంతంలోని రెండు ప్రధాన నగరాల్లో ఉక్రెయిన్ సోమవారం అనేక డ్రోన్ దాడులు చేసిందని మాస్కోలోని ఆగ్నేయ ప్రాంత గవర్నర్ రోమన్ బసుర్గిన్ తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. ఓ ఇల్లు ధ్వంసమైందని రోమన్ బసుర్గిన్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ పేర్కొన్నారు. రష్యా వాయు రక్షణ వ్యవస్థలు యుక్రెయిన్ డ్రోన్ ను కూల్చేశాయి. దీని శిథిలాలు సరతోవ్ నగరంలోని నివాస సముదాయాన్ని ఢీకొనడంతో భవనం స్వల్పంగా దెబ్బతిన్నదని తెలిపారు. నగరం పరిధిలో, ఎంగెల్స్‌లోని ప్రభావిత ప్రాంతాలలో అత్యవసర సేవలు అందించినట్లు గవర్నర్ చెప్పారు.