Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు క్లీన్ ఆంధ్ర.. గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రామ్..

పవన్ పుట్టిన రోజు నాడు జనసేన పార్టీ క్లీన్ ఆంధ్ర... గ్రీన్ ఆంధ్ర... అనే స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు క్లీన్ ఆంధ్ర.. గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రామ్..

Janasena Party Announced Clean Andhra Green Andhra Program on Pawan Kalyan Birthday

Pawan Kalyan : సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. సాధారణంగా పవన్ పుట్టిన రోజు అంటే అభిమానుల హంగామా అంతా ఇంత కాదు. అసలే ఈ సారి గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. పవన్ పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకోడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. అయితే రాజకీయాల్లో గెలిచాక ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ మొదటి పుట్టిన రోజు కావడంతో రాజకీయంగా కూడా పవన్ పుట్టిన రోజు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ క్రమంలో పవన్ పుట్టిన రోజు నాడు జనసేన పార్టీ క్లీన్ ఆంధ్ర… గ్రీన్ ఆంధ్ర… అనే స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది. పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి సంరక్షకుడు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటుదాం, భావితరాలకు స్వచ్ఛమైన పకృతిని అందిద్దాం అని జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేసింది.

Also Read : Kushi 2 – Pawan Kalyan : ఖుషి 2 స్టోరీని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. SJ సూర్య సంచలన వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మొక్కలు నాటుతున్న ఓ ఫోటోని షేర్ చేసి.. ఒక ప్రభుత్వ కాలం 5 సంవత్సరాలు, మనిషి సగటు జీవితకాలం 67 సంవత్సరాలు, ఉసిరి చెట్టు జీవిత కాలం 70 సంవత్సరాలు, నేరేడు చెట్టు జీవిత కాలం 100 సంవత్సరాలు, చింత చెట్టు జీవిత కాలం 100 సంవత్సరాలు, వేప చెట్టు జీవిత కాలం 200 సంవత్సరాలు, రావి చెట్టు జీవిత కాలం 2,500 సంవత్సరాలు.. తరాలు మారుతాయి కానీ మీరు నాటే ఒక మొక్క మరో 2 తరాలకు ఆక్సిజన్, పండ్లు, ఔషద ఫలాలు, పర్యావరణ సమతుల్యత అందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చే నిజమైన జన్మదిన బహుమతి భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించడమే అంటూ జనసేన పార్టీ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మరింది.

View this post on Instagram

A post shared by JanaSena Party (@janasenaparty)