జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూలగొడతారా? అధికారులు కొలతలు తీసుకుంది అందుకేనా..
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేస్తామని అధికారులు తెలిపారు.

Janwada Farm House : జన్వాడ ఫామ్ హౌస్ సంగతేంటి? అసలే దూకుడు మీదున్న హైడ్రా.. జన్వాడ ఫామ్ హౌస్ పైకి బుల్డోజర్లను పంపిస్తుందా? జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ దేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వస్తున్నారు. అయితే, ఫామ్ హౌస్ తన పేరు మీద లేదని, అది తన మిత్రుడిదని, తాను లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ తేల్చి చెబుతున్నారు.
ఈ వాదోపవాదాల మధ్య జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ లో సర్వే చేపట్టారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు అధికారులు. ఫామ్ హౌస్ దగ్గరి నుంచి ఫిరంగి నాలా వెళ్తుందని అధికారులు తెలిపారు. నాలా దగ్గరి నుంచి కొలతలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేస్తామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫామ్ హౌస్ ను పరిశీలించామని, కొలతలు తీశామని, రిపోర్టును వారికి అందజేస్తామన్నారు.
Also Read : ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో స్నేహమే దెబ్బతీసిందా? నాగార్జునపై సీఎం రేవంత్‌కు కోపమెందుకు..!
”ప్రస్తుతం డేటా మాత్రమే తీసుకుంటున్నాం. ఇంకా సర్వే చేయాల్సి ఉంది. ఏయే సర్వే నెంబర్లు వస్తున్నాయి, ఏయే గ్రామాలు వస్తున్నాయి అనే సమాచారం తీసుకుంటున్నాం. శంకర్ పల్లి బోర్డర్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా రేపు, ఎల్లుండి మరింత ముందుకు వెళ్తాం. ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ఇరిగేషన్ అధికారులతో కలిసి సంయుక్తంగా సర్వే చేస్తున్నాం. సర్వే మొత్తం అయ్యాకే వివరాలు చెప్పగలం” అని సర్వే అధికారి మీడియాతో చెప్పారు.