ముంబై నటికి వేధింపుల కేసు.. పోలీసులకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఆదేశం

గతంలో ఈ కేసుని విచారించిన ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఇందులో ఎంత ఉంది? గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు పోలీసులపై ఒత్తిడి చేశారు? ఈ వ్యవహారంలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి?

ముంబై నటికి వేధింపుల కేసు.. పోలీసులకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఆదేశం

Mumbai Actress Case : ముంబై హీరోయిన్ వ్యవహారం కేసులో దర్యాఫ్తు ముమ్మరం చేశారు ఏపీ పోలీసులు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. హీరోయిన్ తో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది. విచారణ కోసం విజయవాడ సీపీ ప్రత్యేకంగా ఏసీపీని నియమించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ముంబైకి ఏపీ పోలీసులను పంపే ఆలోచనలో విజయవాడ సీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ముంబై హీరోయిన్ ను ఓ వైసీపీ నేత వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also Read : ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సస్పెన్స్ ఇంకెన్నాళ్లు? బీజేపీ డిమాండ్ ఏంటి?

బాలీవుడ్ నటి కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గత ప్రభుత్వంలోని పెద్దల మాటలు విని అప్పటి పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటాతో పాటు ఏసీపీ విశాల్ గున్నీ, ఏడీసీపీ తనపై తప్పుడు కేసులు బనాయించారని బాలీవుడ్ నటి ఆరోపించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది. దీనిపై ప్రత్యేక విచారణ జరుపుతోంది. అదే సమయంలో ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించాలని, సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసుకి సంబంధించి ఈ ఉదయం నుంచి గంట గంటకు పరిణామాలు మారుతూ వచ్చాయి. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని విజయవాడ సీపీ తెలిపారు. ఈ కేసులో ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఎంత మేరకు ఉంది? వారు ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. ఈ కేసుకి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ కు హెడ్ గా విజయవాడలోని సీసీఎస్ ఏసీపీగా పని చేస్తున్న స్రవంతి రాయ్ ని నియమించారు. బాలీవుడ్ నటి స్టేట్ మెంట్ తీసుకునేందుకు ఈ స్పెషల్ టీమ్ ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కేసుని విచారించిన ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఇందులో ఎంత ఉంది? గత ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఎందుకు ఒత్తిడి చేశారు? ఈ వ్యవహారంలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి? పోలీసులు ఎదుర్కొంటున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత?

ఇవన్నీ తెలుసుకునే పనిలో స్పెషల్ టీమ్ ఉంది. ఆన్ లైన్ లో అయినా బాలీవుడ్ నటి నుంచి స్టేట్ మెంట్ తీసుకోవాలని ప్రభుత్వం చెప్పగా.. పోలీసులు మాత్రం స్వయంగా ముంబై వెళ్లి నటి నుంచి స్టేట్ మెంట్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ స్రవంతి రాయ్ తన టీమ్ తో కలిసి ముంబై బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.