Faria Abdullah : ఈ మూవీ కోసం నేనే పాట రాసి, పాడి, డ్యాన్స్ కూడా కంపోజ్ చేశాను..

మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

Faria Abdullah : ఈ మూవీ కోసం నేనే పాట రాసి, పాడి, డ్యాన్స్ కూడా కంపోజ్ చేశాను..

Faria Abdullah Sing a Song for Mathu Vadalara 2 Movie and Composed Dance Also

Faria Abdullah : నటి ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మత్తు వదలరా 2 సినిమాతో రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతుండగా తాజాగా నేడు టీజర్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ టీజర్ చూస్తుంటే పార్ట్ 1 లాగే ఫుల్ సస్పెన్స్ కామెడీ ఎంటర్టైనర్ లాగే ఉండబోతుందని తెలుస్తుంది.

Also Read : Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? దసరా కంటే తక్కువే..?

అయితే మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నా సొంతంగా ఒక ర్యాప్ సాంగ్ రాసాను, నేనే రాసి నేనే పాడాను కూడా. అలాగే దీనికి డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా నేనే చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపింది.

హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న ఫరియా అబ్దుల్లా మరి తన ర్యాప్ సాంగ్ తో సింగర్ గా, డ్యాన్సర్ గా ఎలా మెప్పిస్తుందో సినిమాలో చూడాలి.