Inspector Daya : ఈ ఇద్దరు ఇన్‌స్పెక్టర్ ‘దయా’లు ఎదురుపడితే థియేటర్స్ రచ్చే.. సరిపోదా శనివారం వర్సెస్ టెంపర్..

సోషల్ మీడియాలో SJ సూర్య ఇన్‌స్పెక్టర్ దయా పాత్ర వైరల్ అవుతుంది. ఈ క్రమంలో గతంలో ఎన్టీఆర్ టెంపర్ లో చేసిన ఇన్‌స్పెక్టర్ దయ పాత్రని తీసుకొచ్చి కంపేర్ చేస్తున్నారు.

Inspector Daya : ఈ ఇద్దరు ఇన్‌స్పెక్టర్ ‘దయా’లు ఎదురుపడితే థియేటర్స్ రచ్చే.. సరిపోదా శనివారం వర్సెస్ టెంపర్..

Temper NTR Inspector Daya Vs Saripodhaa Sanivaaram SJ Suryah Inspector Daya Movie Lovers Waiting for This Combo

Updated On : August 30, 2024 / 10:36 AM IST

Inspector Daya : పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్ దయా అనే పాత్రలో కనిపించాడు. ఈ పాత్ర ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే మొదట నెగిటివ్ రోల్ లో ఉండి చివర్లో మంచిగా మారుతుంది ఈ పాత్ర.

తాజాగా నాని సరిపోదా శనివారం సినిమాలో SJ సూర్య కూడా ఇన్‌స్పెక్టర్ దయా అనే పాత్ర చేసాడు. ఈ పాత్ర పూర్తిగా నెగిటివ్ పాత్ర. కానీ ఫుల్ ఎనర్జీ ఉండే పాత్ర. సినిమా చూసొచ్చాక అందరూ SJ సూర్య గురించే మాట్లాడుకుంటున్నారు. SJ సూర్య నానిని యాక్టింగ్ లో డామినేట్ చేసాడు అని అంటున్నారు. సూర్య పవర్ ఫుల్ రేంజ్ లో నాని ఢీ కొట్టలేకపోయాడు సినిమాలో అని అంటున్నారు.

Also Read : Balakrishna First Movie : బాలకృష్ణ మొదటి సినిమా రెండు నెలలు బ్యాన్ అయిందని తెలుసా? ఎందకంటే..?

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో SJ సూర్య ఇన్‌స్పెక్టర్ దయా పాత్ర వైరల్ అవుతుంది. ఈ క్రమంలో గతంలో ఎన్టీఆర్ టెంపర్ లో చేసిన ఇన్‌స్పెక్టర్ దయ పాత్రని తీసుకొచ్చి కంపేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్ దయ పాత్ర హీరోగా.. SJ సూర్య ఇన్‌స్పెక్టర్ దయ పాత్ర విలన్ గా పెడితే ఇద్దరూ ఫుల్ ఎనర్జీతో ఒకరికొకరు ఎదురుపడితే థియేటర్స్ లో రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ రెండు పాత్రలతో సినిమా ప్లాన్ చేయండి ఎవరైనా అని పలువురు కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజంగానే ఈ రెండు ఇన్‌స్పెక్టర్ దయా పాత్రలు ఎదురుపడేలా సినిమా వస్తే మాత్రం మాములు హై ఉండదు.