Balakrishna First Movie : బాలకృష్ణ మొదటి సినిమా రెండు నెలలు బ్యాన్ అయిందని తెలుసా? ఎందకంటే..?
బాలకృష్ణ మొదటి సినిమాకు ఇలా ఎన్నో కష్టాలు వచ్చాయి.

Balakrishna First Movie Tatamma Kala Banned for Two Months before its Release
Balakrishna First Movie : యువరత్న, నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి తన నట ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తి కావడంతో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను సెప్టెంబర్ 1న తెలుగు పరిశ్రమ తరపున గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ తో పాటు సౌత్ సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు తరలి రానున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకపైనే ఉంది.
ఈ క్రమంలో బాలయ్య కెరీర్లోని పలు సంఘటనలు ప్రస్తుతమ వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ స్కూల్ లో ఉన్నప్పుడే ఎన్టీఆర్ సినిమా ‘తాతమ్మ కల’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాని ఎన్టీఆర్ నిర్మిస్తూ డైరెక్షన్ చేసారు. 1974 లో ఈ సినిమా రిలీజయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు చాలా ఇబ్బందులు పడింది. రెండు నెలలు బ్యాన్ అయింది, సెన్సార్ ఇవ్వలేదు. బాలకృష్ణ మొదటి సినిమాకు ఇలా ఎన్నో కష్టాలు వచ్చాయి.
Also Read : Pawan Kalyan : ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..
తాతమ్మ కల సినిమా రిలీజ్ సమయానికి దేశంలో కుటుంబ నియంత్రణ కోసం ఇద్దరు ముద్దు ఆపై వద్దు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో దానికి వ్యతిరేకంగా చూపించారు. ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది తల్లితండ్రుల ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం కాదు అని ఎన్టీఆర్ అనేవారు. దానికి తగ్గట్టు ఆ పాయింట్ ని కూడా ఈ సినిమాలో ప్రస్తావించడంతో అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్టీఆర్ పోరాడి అసెంబ్లీలో సైతం ఈ సినిమా గురించి చర్చ జరిగేలా చేసి ఈ సినిమాని రిలీజ్ చేయగలిగారు ఎన్టీఆర్. తాతమ్మ కల 1974 ఆగస్టు 30న రిలీజయింది. ఈ సినిమా రిలీజయి నేటికి 50 ఏళ్ళు. బాలయ్య మొదటిసారి కెమెరా ముందు ఈ సినిమాలోనే మనవడి పాత్రలో కనపడి అలరించారు. ఈ సినిమాలో హరికృష్ణ కూడా నటించారు. ఈ సినిమాకు ఉత్తమ కథా రచయితగా ఎన్టీఆర్‌కు నంది అవార్డు రావడం గమనార్హం.