Infinix Hot 50 5G : భలే ఉంది భయ్యా.. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ అదుర్స్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Infinix Hot 50 5G Launch : ఇన్ఫినిక్స్ ధరను తగ్గించే మరిన్ని బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు.

Infinix Hot 50 5G : భలే ఉంది భయ్యా.. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ అదుర్స్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Infinix Hot 50 5G launched ( Image Source : Google )

Infinix Hot 50 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఇన్పినిక్స్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ ఏడాదిలో ఫస్ట్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. అదే.. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్. కంపెనీ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరల విభాగంలో 7.8ఎమ్ఎమ్ స్లిమ్ డిజైన్, సోనీ 48ఎంపీ ఐఎమ్ఎక్స్582 కెమెరా, టీయూవీ ఎస్‌‌యూడీ సర్టిఫికేషన్ ద్వారా 5 ఏళ్ల మృదువైన పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ, మీడియాటెక్ డైమన్షిటీ 6300 5జీ చిప్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్స్‌లోకి ప్రవేశించే ముందు ధర, ఇతర వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : iPhone 15 Pro Max : ఆపిల్ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్.. భారత్‌లో ధర ఎంత తగ్గిందంటే?

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999కు పొందవచ్చు. ఈ ఫోన్ మొత్తం 4జీబీ, 8జీబీ అనే రెండు మెమరీ వేరియంట్లలో వస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ.9,999, 8జీబీ వేరియంట్ ధర రూ.10,999కు అందిస్తుంది. సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ ప్రారంభం కానుంది.

ఇన్ఫినిక్స్ ధరను తగ్గించే మరిన్ని బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు ఫోన్ రూ.8,549కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం స్లీక్ బ్లాక్, వైబ్రాంట్ బ్లూ, సేజ్ గ్రీన్, డ్రీమీ పర్పుల్ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ 7.8ఎమ్ఎమ్ మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ కర్వడ్ ఎడ్జ్‌లతో రెక్టాంగులర్ మాడ్యూల్‌పై దువా-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డ్రీమీ పర్పుల్ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. మొత్తం 4 కలర్లలో మిగిలిన మూడింటిలో బ్రైట్‌నెస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. లేకపోతే, బ్యాక్ ప్యానెల్ దిగువ భాగంలో ఇన్ఫినిక్స్ 5జీ బ్రాండ్‌తో క్లీన్‌గా ఉంటుంది.

120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 మాదిరిగా ఇంటరాక్టివ్ యూఐతో డైనమిక్ బార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ, 8జీబీ అనే రెండు మెమరీ వేరియంట్లలో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఎక్స్ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది. ఏఐ ఛార్జ్ ప్రొటెక్షన్‌తో కూడా వస్తుంది. ఏఐ ఛార్జ్ ప్రొటెక్షన్ బ్యాటరీ హెల్త్, ఛార్జింగ్ ప్యాటర్న్‌ని ట్రాక్ చేసేందుకు వినియోగించవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 48ఎంపీ డ్యూయల్-రియర్ కెమెరాను కలిగి ఉంది. 12 కెమెరా మోడ్‌లను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఆసక్తికరంగా, ఫ్రంట్, బ్యాక్ కెమెరాలకు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం.. సబ్‌స్క్రైబర్‌ల కోసం స్పెషల్ ప్లాన్లు, ఓటీటీ బెనిఫిట్స్ ఇవే!