Aadhaar Card Update : ఆధార్ హోల్డర్లకు బిగ్ అలర్ట్.. ఈ నెల 14 వరకు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
Aadhaar Card Update : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రస్తుతం పౌరులు తమ ఆధార్ కార్డ్‌ను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి అనుమతిస్తోంది.

Indian govt says it is important to update Aadhaar card every 10 years
Aadhaar Card Update : ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. భారతీయ నివాసితులకు అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి. ఈ ఆధార్ ఐడీ ప్రూఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ అవుతుంది. గుర్తింపు, చిరునామాకు రుజువుగా ఉపయోగించవచ్చు.
ఆదాయపు పన్ను, స్కూల్ లేదా కాలేజీ, అడ్మిషన్‌లు, ప్రయాణం సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డ్ ప్రాముఖ్యత దృష్ట్యా అప్‌డేట్ చేయడం చాలా అవసరం. పౌరులు తమ సమాచారం కచ్చితంగా లేటెస్టుగా ఉండేలా చూసుకోవాలి. అందుకే, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తమ ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయాలని భారత ప్రభుత్వం కోరుతోంది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రస్తుతం పౌరులు తమ ఆధార్ కార్డ్‌ను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి అనుమతిస్తోంది. ఈ గడువు గత సంవత్సరంలో అనేకసార్లు పొడిగించింది. గడువు సమీపిస్తుండటంతో మరోమారు పొడిగిస్తారా అనే ఆందోళన పౌరుల్లో నెలకొంది. అయితే, తదుపరి పొడిగింపులపై యూఐడీఏఐ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఆధార్ హోల్డర్‌లు తమ ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. ఇందుకోసం రుసుము రూ. 50 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
- మీ ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయొచ్చు.
- అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్‌కి వెళ్లి, (https://myaadhaar.uidai.gov.in/)లో ఆధార్ సెల్ఫ్-సర్వీస్ పోర్టల్‌కు నావిగేట్ చేయండి.
- లాగిన్ చేసేందుకు మీ ఆధార్ నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఉపయోగించండి.
- మీ ప్రొఫైల్‌లో కనిపించే ప్రస్తుత ఐడెంటిటీ, అడ్రస్ వివరాలు సరైనవని నిర్ధారించుకోండి. ఆపై రివ్యూ చేయండి.
- మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలనుకుంటే.. డ్రాప్-డౌన్ మెను నుంచి తగిన డాక్యుమెంట్ టైప్ ఎంచుకోవాలి.
- ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.
- సపోర్టు ఉన్న ఫైల్ ఫార్మాట్‌లలో జేపీఈజీ, పీఎన్‌జీ, పీడీఎఫ్ ఉన్నాయి. ఫైల్ సైజు తప్పనిసరిగా 2ఎంబీ కన్నా తక్కువగా ఉండాలి.
- మీ అప్‌డేట్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN)ని అందుకుంటారు.
- మీ అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ నంబర్‌ను ఉపయోగించవచ్చు.
ఆన్‌లైన్ పోర్టల్ వ్యాలిడిటీ అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్ (PoI), అడ్రస్ ప్రూఫ్ (PoA) డాక్యుమెంట్లను ఉపయోగించి వివరాలను అడ్రస్ చేయడానికి అప్‌డేట్ చేయొచ్చు. బయోమెట్రిక్, పేరు, మొబైల్ నంబర్, ఫొటోగ్రాఫ్ వంటి ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయలేరు. ఈ వివరాలను అప్‌డేట్ చేసేందుకు మీరు వ్యక్తిగత అథెంటికేషన్ కోసం యూఐడీఏఐ-అధీకృత కేంద్రాన్ని సందర్శించాలి.
ఆధార్‌ను అప్‌డేట్ ఎందుకు ముఖ్యమంటే? :
ఆధార్ కార్డులోని సమాచారం కచ్చితత్వాన్ని నిర్ధారించడం, వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలను పొందడానికి ఆధార్ కార్డ్ హోల్డర్‌లు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తమ వివరాలను అప్‌డేట్ చేయాలని యూఐడీఏఐ సిఫార్సు చేస్తోంది. మీ ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్‌గా ఉంచడం వల్ల లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు సమర్ధవంతంగా ఖచ్చితంగా అందజేయొచ్చు. రెగ్యులర్ అప్‌డేట్, ఆధార్-లింక్ బెనిఫిట్స్ వంటి సేవలను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడం వల్ల జనాభా వివరాల కచ్చితత్వాన్ని పొందడంలో సాయపడుతుంది.