Elon Musk X TV Beta : ఎలన్ మస్క్ ‘ఎక్స్’ టీవీ బీటా వెర్షన్ ఇదిగో.. కీలక ఫీచర్లు, ఎలా వాడాలంటే?
Elon Musk X TV Beta : ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు ’ఎక్స్‘ యాప్‌లోనే సినిమాలు, లైవ్ మెటీరియల్‌ని చూడవచ్చు. ఇతర మీడియా ప్లేయర్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

Elon Musk Unveils X TV Beta Version_ Key Features And Usage Tips
Elon Musk X TV Beta : ప్రముఖ టెస్లా మోటార్స్ సీఈఓ, ఎలన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ’ఎక్స్‘ ప్రముఖ మల్టీమీడియా ప్లాట్‌ఫారమ్‌గా మార్చే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. టెక్ టైకూన్, స్పేస్ఎక్స్ యజమాని ఇటీవల ఎక్స్ టీవీ బీటా వెర్షన్‌ను సోషల్ మీడియాలో రివీల్ చేశారు.
ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు ’ఎక్స్‘ యాప్‌లోనే సినిమాలు, లైవ్ మెటీరియల్‌ని చూడవచ్చు. ఇతర మీడియా ప్లేయర్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ ఎక్స్‌టర్నల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్స్ యూజర్ డిపెండెన్సీని తగ్గిస్తుంది.
ఇప్పటికే, ఈ ఫీచర్ మీడియా యాప్ బీటా వెర్షన్‌లో విడుదలైంది. ఎక్స్ యాప్ వినియోగదారులందరికీ పూర్తిగా అందుబాటులో ఉండదు. ప్రారంభంలో కొందరి యూజర్లు ఇప్పటికే యాప్ యాక్టివిటీని అన్వేషిస్తున్నారు. వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రూపొందిస్తుందని భావిస్తున్నారు.
Beta version of 𝕏 TV is out https://t.co/taODqsMECS
— Elon Musk (@elonmusk) September 3, 2024
ఎక్స్ టీవీ అతి త్వరలో పూర్తి ఫీచర్లతో లాంచ్ కానుంది. ఎక్స్ టీవీ యాప్ బీటా వెర్షన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీల్లో లైవ్ అయింది. ఎల్‌జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీలో అందుబాటులో ఉంటుంది. మరిన్ని ఇంటిగ్రేషన్‌లు త్వరలో రానున్నాయి.
డిజిట్ ప్రకారం.. కొత్త మీడియా ప్లాట్‌ఫారమ్ ముఖ్య ఫీచర్లు :
రీప్లే టీవీ : మీరు ఈ ఫీచర్‌తో క్లౌడ్‌లో గరిష్టంగా 72 గంటల షోలను స్టోర్ చేయవచ్చు.
స్టార్ట్‌ఓవర్ టీవీ : వీక్షకులు ఆలస్యంగా ట్యూన్ చేసినప్పటికీ, మొదటి నుంచి ఏదైనా లైవ్ షోను ఎనేబుల్ చేసేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.
ఫ్రీ క్లౌడ్ డీవీఆర్ : వినియోగదారులు ఈ ఫీచర్‌తో ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా గరిష్టంగా 100 గంటల కంటెంట్‌ను రికార్డ్ చేయవచ్చు.
Read Also : Star Health Insurance : స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.. భారత్‌లోనే తొలిసారిగా బ్రెయిలీలో బీమా పాలసీ..!