iPhone 15 Pro Max : ఆపిల్ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్.. భారత్‌లో ధర ఎంత తగ్గిందంటే?

iPhone 15 Pro Max Launch : రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఫోన్ రూ. 1,37,990 ధరతో అందిస్తుంది. అదే ఐఫోన్ భారత మార్కెట్లో రూ. 1,59,900కి గత ఏడాదిలో ప్రకటించింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌పై రూ.21,910 భారీ తగ్గింపును ఇస్తోంది.

iPhone 15 Pro Max : ఆపిల్ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్.. భారత్‌లో ధర ఎంత తగ్గిందంటే?

Apple iPhone 15 Pro Max gets massive discount in India, price drops by Rs 21,910 on Reliance Digital

iPhone 15 Pro Max : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 16 సిరీస్‌ను భారత్, ఇతర మార్కెట్‌లలో సెప్టెంబర్ 9న లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐఫోన్ 15 లాంచ్‌కు ముందు ధర ఆన్‌లైన్‌లో తగ్గింది. ఐఫోన్ 15, ప్లస్ మోడల్ ఇప్పటికే తక్కువ ధరకు అందుబాటులో ఉండగా, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఇప్పుడు భారత్‌లో భారీ తగ్గింపు ఆఫర్‌తో విక్రయిస్తోంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Samsung Galaxy A06 : శాంసంగ్ గెలాక్సీ A06 కొత్త ఫోన్ చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

భారత్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ :
ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఫోన్ రూ. 1,37,990 ధరతో అందిస్తుంది. అదే ఐఫోన్ భారత మార్కెట్లో రూ. 1,59,900కి గత ఏడాదిలో ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌పై రూ.21,910 భారీ తగ్గింపును ఇస్తోంది. బ్లాక్ టైటానియం కలర్‌తో కూడిన 256జీబీ స్టోరేజ్ మోడల్ కూడా అందిస్తోంది.

దీనికి అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 5వేల అదనపు తగ్గింపు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 1,32,990కి తగ్గుతుంది. బ్యాంక్ కార్డ్‌లపై మరింత డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ కొనుగోలుకు ఆసక్తి ఉన్న యూజర్లు స్టోర్ ఆఫర్‌ను పొందవచ్చు.

ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ స్పెషిఫికేషన్లు :
ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ 2796×1290 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. గరిష్ట ప్రకాశంతో 2000నిట్స్ వరకు సపోర్టును కలిగి ఉంది. ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఆపిల్ ఎ17 ప్రో చిప్ ద్వారా రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో సాటిలేని పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 15 ఫోన్ స్టీరియో స్పీకర్లు, ఐపీ68 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లోని కెమెరా సిస్టమ్ ‘ఏడు కెమెరా లెన్స్‌లకు సమానం‘ అని కంపెనీ తెలిపింది. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ మెరుగైన లో-లైటింగ్, లెన్స్ ఫ్లేర్-ఫ్రీ ఫొటోలకు 48ఎంపీ కెమెరాను పొందవచ్చు. వినియోగదారులు ఫోకల్ పొడవు (24 మిమీ, 28 మిమీ, 35 మిమీ) మధ్య మారవచ్చు. 120 మిమీ వరకు 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. 4కె60 ప్రోరెస్ వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ 20డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 7.5డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో 4,441mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Brain Cancer Risk : మొబైల్ ఫోన్ల వాడకంతో బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరగదు : WHO క్లారిటీ ఇచ్చిందిగా..!