మళ్ళీ పెరుగుతున్న మున్నేరు వరద ఉధృతి, భయాందోళనలో ఖమ్మం ప్రజలు..!

మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉందని తెలియడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలర్ట్ అయ్యారు. మరోసారి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయలుదేరారు.

మళ్ళీ పెరుగుతున్న మున్నేరు వరద ఉధృతి, భయాందోళనలో ఖమ్మం ప్రజలు..!

Munneru Flow : మున్నేరు వరద సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మున్నేరు వరద ఉధృతి ఖమ్మంలో బీభత్సం చేసింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మున్నేరు వరద ఉధృతిలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇప్పుడిప్పుడే దాన్ని నుంచి తేరుకుంటున్న వదర బాధితులకు మరో షాక్.

మున్నేరు వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుంనని హడలిపోతున్నారు. మరోవైపు వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులను ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు.

మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉందని తెలియడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలర్ట్ అయ్యారు. మరోసారి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

మున్నేరు వాగుకి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

అటు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ఖమ్మం బయలుదేరారు. సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లారు. అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read : కష్టాలు పునరావృతం కాకూడదని కేసీఆర్ నవగ్రహ యాగం.. పూర్తి వివరాలు