Dragon Fruit : ఒక్కసారి నాటితే.. 25 ఏళ్లు దిగుబడి ఇస్తుంది

డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు యువరైతులు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారి నాటితే 25 ఏళ్లపాటు దిగుబడి ఇస్తుండటంతో ఈ పంట వేసేందుకు ముందుకు వస్తున్నారు.

Dragon Fruit : ఒక్కసారి నాటితే.. 25 ఏళ్లు దిగుబడి ఇస్తుంది

Dragon Fruit

Dragon Fruit : ఉద్యాన పంట సాగులోనే వైవిధ్యమైంది డ్రాగన్‌ఫ్రూట్‌. తెలుగు రాష్ట్రాలలోనూ వీటి సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేలడంతో రైతులు ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది మంచి లాభాలను సాధిస్తుండగా, ఇప్పుడిప్పుడే మరి కొంత మంది సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరంలో ప్రయోగాత్మకంగా సాగుచేపట్టి ఇప్పుడిప్పుడే దిగుబడులను పొందుతున్నారు.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సరికొత్త పంట డ్రాగన్ ఫ్రూట్. 5 సంవత్సరాలుగా ఔత్సాహిక రైతులు ప్రయోగాత్మకంగా ఈ పంటసాగుచేపట్టి ముందుకు వెలుతున్నారు. మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు చాలామంది రైతులు ఈ పంట సాగుపై దృష్టిసారిస్తున్నారు. ఈ కోవలోనే పయనిస్తున్నారు కృష్ణా జిల్లా, విసన్నపేట మండలం, విసన్నపేట గ్రామానికి చెందిన యువరైతు వెల్ది కుషాల్. 2019లో వియత్నం నుండి రెడ్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తెప్పించి ఎకరం పొలంలో సాగుచేశారు.

పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు వుండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. తీగలాగా విస్తరించి పెరుగుతుంది కనుక నేలపై పెంచేందుకు వీలులేదు. దీని జీవితకాలం 20 నుండి 25 సంవత్సరాలు వుంటుంది కనుక, శాశ్వత నిర్మాణాలు అంటే సిమెంటు పోల్స్ పై రింగ్ ఏర్పాటు చేసి పెంచాల్సి వుంటుంది. అందువల్ల ప్రారంభపు పెట్టుబడి అధికంగా వుంటుందంటారు రైతు చెబుతున్నారు.

ఈ సాగుకి సంబంధించి రైతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నాటిన 6వ నెల నుండి ఈ పంటలో పూత ప్రారంభమవుతుంది. అయితే మొక్కలు దృడంగా పెరగవని ఈ రైతు పూతను తీసివేశాడు. ప్రస్తుతం మొక్కల వయస్సు సంవత్సరన్నర. ఇప్పుడిప్పుడే పండ్ల దిగుబడి ప్రారంభమైంది. చల్లని వాతావరణంలో అంటే జూన్ నుండి డిసెంబరు వరకు పండ్ల దిగుబడి తీసుకోవచ్చు.