Korra Crop cultivation : వేసవిలో తక్కువ నీటితో కొర్రపంటసాగు!

కొర్ర రకాలు అన్నీ దాదాపు 28- 32 రోజుల్లో పూత దశకు వస్తాయి. ఆ సమయంలో పంట బెట్టకు లోనుకాకుండా చూసుకోవాలి. గింజ పాలుపోసుకొనే దశను దాటి 58-62 రోజుల్లో పరిపక్వానికి వచ్చి కోతకు వస్తుంది.

Korra Crop cultivation : వేసవిలో తక్కువ నీటితో కొర్రపంటసాగు!

Korra Cultivation

Korra Crop cultivation : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతున్న పంటలలో కొర్ర కూడా ఒకటి. ఆరుతడి కింద సాగుకు కొర్ర పంట అనుకూలం. వేసవి కాలంలో తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు కూడా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. కేవలం 30 రోజులు కాపాడుకోగలిగితే పంట దిగుబడి వస్తుంది. ఈ రకాన్ని ఏడాదిలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. తక్కువ నీటి లభ్య తతో పంటను సాగుచేపట్టవచ్చు.

ఎకరాకు 3 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలను వరుసల మధ్య 22.5 సెం.మీ., మొక్కల మధ్య 7.5 సెం.మీ. దూరంలో గొర్రుతో విత్తుకోవాలి. ఎకరాకు 2 లక్షల 37 వేల మొక్కలు ఉండాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేయాలి. నాటిన 3-4 వారాల తర్వాత అంతరకృషి చేసి, తడి ఇచ్చి పైపాటుగా మరో 8 కిలోల నత్రజనిని వేసుకోవాలి. విత్తిన రెండు వారాల్లోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తొలగించుకోవాలి.

కొర్రలో మధ్యస్థ, స్వల్పకాలిక రకాలైన శ్రీలక్ష్మీ, నరసింహరాయ, కృష్ణదే వరాయ, ఎస్ఐఎ3085, ఎస్ఐఎ 316, సూర్యనంది ప్రసాద్ రకాలు ప్రస్తుతం రైతులకు అందు బాటులో ఉన్నాయి. ఈ రకాలన్నీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి విడుదలై దేశమంతా సాగువుతున్నాయి. అత్యల్పకాలిక కొర్ర రకం ఎస్ఐఎ 3222 28-32 రోజుల్లో పూతకు వచ్చి కేవలం 58-62 రోజుల్లో పక్వానికి వస్తుంది.

కొర్ర ఎలాంటి పిలకలు లేకుండా ఏకకాండం ఉండటం వల్ల యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది. గింజ దిగుబడి సుమారుగా ఎకరానికి 6-8 క్వింటాళ్లు వస్తుంది. చొప్ప కూడా ఎకరాకు రెండున్నర టన్నుల వరకు వస్తుంది. తక్కువ కాలంలో, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు కూడా కచ్చితమైన గింజ, చొప్పను ఇచ్చు రకం. అతి స్వల్పకాలంలో పంటను వస్తుంది గనుక ఈ రకాన్ని పంటల సరళిలో వినియోగించుకోవచ్చు. నల్లరేగడి భూముల్లో కొర్ర రకాన్ని వర్షాధారంగా ఖరీఫ్ లో సాగు చేసుకొని అదనంగా గింజ, చొప్ప దిగుబడి, అదనపు ఆదాయం పొందవచ్చు.

కొర్ర రకాలు అన్నీ దాదాపు 28- 32 రోజుల్లో పూత దశకు వస్తాయి. ఆ సమయంలో పంట బెట్టకు లోనుకా కుండా చూసుకోవాలి. గింజ పాలుపోసుకొనే దశను దాటి 58-62 రోజుల్లో పరిపక్వానికి వచ్చి కోతకు వస్తుంది. వరికోత యంత్రాలతో జల్లెడ మార్చుకొని పంటను కోయవచ్చు లేదా కూలీలతో పంటకోసి పొలంలో గింజలు ఆరాక నూర్పిడి యంత్రాల సాయంతో గింజలను వేరుచేసుకోవచ్చు. గింజల్లో తేమశాతం 10-12 ఉన్నప్పుడే దీర్ఘకాలం నిల్వకు అవకాశం ఉంటుంది.

కొర్రలో సస్యరక్షణ:

కొర్ర పంటలో పురుగులు, తెగుళ్ళు తక్కువగా ఆశిస్తాయి. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాలను మేధావులు సిఫారసు చేస్తున్నారు. చిరుధాన్య పంటల సాగు ఎంతో అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు ఉన్నప్పుడు పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. నివారణకు సిఫారసు చేసిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కాండం తొలచు పురుగు: ఈ పురుగు కాండాన్ని తొలచటం వల్ల మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి రెండుసార్లు 20-30 రోజుల మధ్య పిచికారి చేయాలి.

గులాబి రంగు పురుగు: లార్వాలు మొవ్వును తొలచి తినడం వల్ల మొవ్వు చని పోతుంది. పూతదశలో ఆశిస్తే వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారి చేసి నివారించుకోవాలి.

చెదలు: భూమిలో ఉన్న కొర్ర వేర్లను చెదలు ఆశించటం వల్ల మొక్కలు వాడి చనిపోతాయి. వీటి నివారణకు చివరి దుక్కిలో ఫాలిడాల్ 2 శాతం పొడి మందును ఎకరాకు 10 – 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేలా వేసి పంటను కాపాడుకోవాలి.