Peanuts : శనగలో కొత్త వంగడం…అధిక దిగుబడి సాధ్యం

ఈ కొత్త శనగ వంగడం పంటకాలం 95 రోజుల నుండి 100రోజులు, దక్షిణ భారత దేశ రాష్ట్రాల్లలో ఇదిసాగుకు అనుకూలమైన వెరైటీ అని శాస్త్రవేత్తలు తెలిపారు. గింజలు చూడటా

Peanuts : శనగలో కొత్త వంగడం…అధిక దిగుబడి సాధ్యం

Peanut

Peanuts : అధిక దిగుబడి నిచ్చే కొత్త శనగ రకం వంగడాన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్ధానం విడుదల చేసింది. నంద్యాల గ్రామ్ 857 పేరుతో ఈ వెరైటీ రకాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు లభిస్తున్న రకాలకంటే నంద్యాల గ్రామ్ అధిక దిగుబడిని ఇవ్వటంతోపాటు చీడపీడలను తట్టుకునే గుణాన్ని కలిగి ఉన్నట్లు శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.

అఖిలభారత సమన్వయ పధకం ద్వారా మూడేళ్లుగా శనగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి సారధ్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపింది. వీరి విశేష కృషి ఫలితంగా ఎన్ బీ ఈ జీ 857 దేశవాళీ రంకం వంగడాన్ని కనుగొన్నారు. ఇప్పటి వరకు ఉన్న వంగడాలతో పోలిస్తే మెరుగైనది శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గింజనుండి పప్పు 75శాతంగా పరిశోధనల్లో నమోదైంది. 100 గింజల బరువు 234 గ్రాములుండగా, ప్రొటీన్ శాతం 21.7శాతంగా నమోదైంది.

ఈ కొత్త శనగ వంగడం పంటకాలం 95 రోజుల నుండి 100రోజులు, దక్షిణ భారత దేశ రాష్ట్రాల్లలో ఇదిసాగుకు అనుకూలమైన వెరైటీ అని శాస్త్రవేత్తలు తెలిపారు. గింజలు చూడటానికి ఆకర్షిణీయంగా ఉండటంతోపాటు దిగుబడి అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. కర్నాటక, తమిళనాడు తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో శనగలో వచ్చిన ఈ కొత్త వంగడం రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమౌతుంది.