Cultivation of Rice : ముదురు వరినారు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరి సాగుచేసే రైతులు నార్ల కంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Cultivation of Rice : ముదురు వరినారు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Cultivation of Rice

Cultivation of Rice : ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం ఆలస్యమైంది. బోర్లు, బావుల కింద ముందుగా వరి నారుమళ్లు పోసుకున్న రైతాంగం నాట్లు వేస్తున్నారు. చాలా చోట్ల వర్షాభావ పరిస్థితుల కారణంగా సకాలంలో నాట్లు పడలేదు. దీంతో నారుముదిరి పోయింది. ఈ నేపధ్యంలో  దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే ముదురు నారు నాటేటప్పుడు రైతులు పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ .

READ ALSO : Weed Control : వెద వరి సాగులో.. కలుపు నివారణ

తొలకరి ఆరంభంలోనే నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, ఆతరువాత వర్షాలు లేకపోవడంతో సకాలంలో నాట్లు వేయలేకపోయారు.  వానాకాలం సీజన్లో ఇప్పటికే అదను దాటిపోయింది. ఇప్పటికి కొంత మంది రైతులు నార్లు పోసుకోలేకపోయారు.

READ ALSO : Paddy Crop Cultivation : నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి సాగు.. చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

అయితే రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరి సాగుచేసే రైతులు నార్ల కంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

READ ALSO : Paddy Weed Management : వరి సాగులో కలుపు, సూక్ష్మధాతు లోపం – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ముందుగా నారు పోసుకున్న రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దిగుబడులు తగ్గకుండా ఉంటాలంటే కొన్ని మెళకువులు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ .