Tomato Cultivation : టమాటలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ

టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది.

Tomato Cultivation : టమాటలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ

Tomato Cultivation

Updated On : October 29, 2023 / 10:16 AM IST

Tomato Cultivation : మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉద్యాన పంటల్లో చీడపీడల ఉధృతి అధికమవుతోంది. వీటిని అరికట్టేందుకు రైతులు అధిక ఖర్చు చేస్తున్నారు. చీడపీడల ఉధృతితె  పంట పెరుగుదల క్షీణించి, దిగుబడి గణనీయంగా తగ్గిపోమే ప్రమాదముంది.

READ ALSO : ATM Cultivation : ఏటీఎం సాగు.. 70 సెంట్లలో 26 రకాల పంటలు

ముఖ్యంగా టమాట తోటల్లో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉధృతి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెగులు లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది. ఈ తెగులు  తెగులు ఆశించినట్లైతే కాయలు పిందె దశలోనే కుళ్లిపోవటం, ఆకులు రాలిపోవటంతో పంట పెరుగుదల క్షీణిస్తుంది . ఉభయ తెగులు రాష్ట్రాల్లో చాలాప్రాంతాల్లో టమాట తోటల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

READ ALSO : Integrated Agriculture : సమీకృత వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి.. రైతుకు భరోసానిస్తున్న పలు పంటలు, అనుబంధ రంగాలు

చాళ్ల మధ్య కలుపును సకాలంలో అరికట్టినప్పటికీ తెగులును సకాలంలో గుర్తించకపోవటం వల్ల, తోటలో దీని ఉధృతి పెరిగిపోతుంది. దీంతో దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు ఈ బాక్టీరియా ఆకుమచ్చ తెగులుగా నివారించేందుకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్.