Maize Cultivation : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పంట చేతికోచ్చే సమయంలో తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం జరిగింది. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్తితి లేదు.  ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని కోరుతున్నారు.

Maize Cultivation : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

Maize Cultivation

Maize Cultivation : ఆరుగాలం కష్టించి పంటలు పండించిన  అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి  పంట చేతికోచ్చే సమయంలో తెగుళ్లు ఆశించడంతో  లబోదిబో మంటున్నారు. వరి పంటతో నష్టాలు వస్తుండటంతో ప్రత్యామ్నాయ పంటగా ఈ ఖరీప్ లో వేల ఏకరాల్లో  మొక్క జోన్నను సాగుచేశారు. అయితే ఇప్పుడు చీడపీడలు ఆశించి పంట దెబ్బతినడంతో  రెంటికి చెడ్డ రేవడిగా మారింది శ్రీకాకుళం మొక్కజొన్న రైతుల పరిస్థితి. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరుతున్నారు.

READ ALSO : Green Leafy Vegetables : సిరులు పండిస్తున్న ఆకుకూరల సాగు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వరి అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఆ తరువాతే మెక్కజోన్న , ప్రత్తి , చెరకు పంటలు ఉంటాయి . ప్రతి ఏటా వరి ఉత్పత్తి అధికమవుతుండటంతో  , కోనుగోలు సమస్యలు ఎదుర్కవుతున్నారు. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మెగ్గుచూపాలని కోరారు.  పోందూరు మండలం గోకర్ణపల్లి , రంఘనాధపేట గ్రామాల్లో చాలా మంది రైతులు గత ఏడాది వరికి ప్రత్యామ్నాయంగా  మెక్కజోన్న సాగుచేపట్టారు. మంచి దిగుబడులను పొందారు. ఈ ఏడాది కూడా మెక్కజోన్న పంటనే వేశారు. అయితే  మారిన వాతావరణ పరిస్దితుల కారణంగా  పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రనష్టం వాటిల్లింది.

READ ALSO : Muscle Building : కండరాల నిర్మాణంలో సహాయపడే గుడ్లు !

మొక్క జోన్న పంటలో వచ్చిన సమస్యలను రైతులు సకాలంలో గుర్తించలేఖ పోవడంతోనే సమస్య జటిలం అయ్యిందంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పాముపోడ తెగులు ఆశించడంతో నష్టం జరిగిందని.. ఉన్న పంటను కాపాడుకునేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పంట చేతికోచ్చే సమయంలో తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం జరిగింది. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్తితి లేదు.  ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని కోరుతున్నారు.