Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక.. సన్నగింజ వరి రకాలు

తెలంగాణ ప్రాంతంలో ఈ ఖరీప్ కు రైతులు మధ్య, స్వల కాలిక వరి రకాలను మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. అయితే ఈ ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక సన్నగింజ రకాలు వాటి గుణగణాలేంటో  చూద్దాం..

Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక.. సన్నగింజ వరి రకాలు

rice varieties suitable for Kharif

Rice Varieties : వాతావరణ మార్పులు రైతుల పాలిట శాపంగా మారాయి. పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగండ్ల వానలతో వరిరైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్తితులు దాపురించాయి. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఈ ఖరీప్ కు రైతులు మధ్య, స్వల కాలిక వరి రకాలను మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. అయితే ఈ ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక సన్నగింజ రకాలు వాటి గుణగణాలేంటో  చూద్దాం..

READ ALSO : Intercropping In Kandi : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు. దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతుంది.  చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు, కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది.

READ ALSO : Sorghum Cultivation : ఖరీఫ్ జొన్న సాగులో మేలైన యాజమాన్యం

ఈ నేపధ్యంలో మధ్య, స్వల్పకాలిక రకాలను సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.  మధ్య కాలిక రకాలు జులై మొదటి వారం వరకు పోసుకునే అవకాశం ఉండగా  స్వల్ప కాలిక రకాలు జులై చివరి పోసుకోవచ్చు. అసలు ఖరీఫ్ కు అనువైన మధ్య, స్వల్పకాలిక రకాలేంటీ..? వాటి గుణగణాలేంటో  రైతులకు తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా, కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. ఎన్. లింగయ్య.